అలనాటి నటి జమున గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఇవే..

తొలి తరం హీరోయిన్లలో ఒకరైన జమున తన 16వ ఏటలోనే సినీ రంగంలో అడుగు పెట్టింది. ఈ ముద్దుగుమ్మ డా.గరికపాటి రాజారావు డైరెక్ట్ చేసిన పుట్టిల్లు (1953)లో తొలిసారిగా నటించింది. L.V. ప్రసాద్ మిస్సమ్మ (1955)తో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఎంత కాలంగా తెలుగు ప్రేక్షకుల అలరించిన ఈ నటి నేడు ప్రాణాలు విడిచింది. అనారోగ్యాలతో కొంత కాలంగా బాధపడుతున్న ఈ నటి ఇవాళ ఉదయం 86 ఏళ్లలో కన్ను మూసింది. జమున 1936, ఆగస్టు 30న కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో నిప్పాని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి జన్మించింది. ఆమె తండ్రి పసుపు, పొగాకు వ్యాపారం చేసేవారు. ఆమె పుట్టిన 7 ఏళ్ల తర్వాత కుటుంబమంతా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల గ్రామానికి తరలి వచ్చింది. జమున బాల్యం అంత అక్కడే గడిచింది.

దుగ్గిరాలలో మహానటి సావిత్రి డ్రామాలో నటిస్తున్నప్పుడు జమున ఇంట్లోనే ఉండేది. అలా సావిత్రి, జమున మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. జమున 15-16 ఏళ్ల వయస్సులో సినిమాల్లో హీరోయిన్‌గా ప్రవేశించింది. జమున మాతృభాష కన్నడ. జమునకి చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి ఉండేది. అలా ఆమె ఖిల్జిరాజ్యాపట్టణం అనే నాటకంలో మొదటిసారిగా నటించింది. నాటకాల ద్వారా జమున మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత సావిత్రి సలహాతో పుట్టినిల్లు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆపై ఎంతో మంది పెద్ద హీరోలతో కలిసి నటించింది.

డ్రామాల్లో సత్యభామ పాత్ర జమునకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా శ్రీకృష్ణతులాభారం అనే సినిమాలో ఆమె సత్యభామ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. జమున తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం లాంటి భాషలో నటించింది. ఇక మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీపై ఎనలేని అభిమానంతో రాజకీయాలోకి కూడా అడుగుపెట్టింది జమున. ఆమె ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయ జీవితం గడుపుతూ ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది.

జమున 1965లో SV యూనివర్సిటీలో జువాలజీ ప్రొఫెసర్ అయిన ప్రొఫెసర్ జూలూరి రమణారావును పెళ్లి చేసుకుంది. 2014లో రమణారావు(86) గుండెపోటుతో మరణించాడు. జమునకు వంశీ, స్రవంతి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.