రామ్ పోతినేని స్టైలిష్ లుక్ చూసారా? అదుర్స్ అంతే!

రామ్ పోతినేని గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ముఖ్యంగా అమ్మాయిలకు మన కుర్రోడు కలల దేవదాస్ అని చెప్పుకోవాలి. మొదటి సినిమా దేవదాస్ చిత్రంతోనే రామ్ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అక్కడితోనే ఎనెర్జిటిక్ స్టార్ గా గుర్తింపు సాధించాడు. బేసిగ్గా నిర్మాతల ఫ్యామిలీ నుండి వచ్చిన రామ్ తనదైన నటనతో అభిమానులను సొంతం చేస్తుకున్నాడు. చాకోలెట్ బాయ్ లా పేరుతెచ్చుకున్న రామ్ అనతికాలంలోనే మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

ఇక ఆమధ్య పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అయితే దుమ్ము దులిపేసాడు రామ్ పోతినేని. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో రామ్ ఫాలోయింగ్ అనూహ్యంగా పెరిగింది. ఈ సినిమా తర్వాత రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమా చేసాడు. కానీ ఈ సినిమా విజయం ఎలాంటి ఫలితం ఇచ్చిందో అందరికీ తెలిసినదే. దీంతో ఈసారి రామ్ ఈసారి యాక్షన్ డైరెక్టర్ ను లైన్లో పెట్టాడు. అతడే బోయపాటి శ్రీను. ఇక బోయపాటి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

టాలీవుడ్లో బాలయ్యతో బాక్షాఫీస్ అంతు చూసే బోయపాటి అంటే నందమూరి అభిమానులకు మంచి గురి. అలాంటి దర్శకుడితో రామ్ సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే ఈ సినిమా షూట్ స్టార్ట్ అయినట్టు భోగట్టా. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు టాక్ బయటకు వచ్చింది. ఇది ఇలా ఉండగా రామ్ తాజా మేకోవర్ పిక్ బయటకు వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదిరిపోయే గాగుల్స్, ఫుల్ గడ్డంతో రగ్డ్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

Share post:

Latest