హోటల్ వెయిటర్లతో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన అనసూయ.. వీడియో వైరల్!

బుల్లితెర యాంకర్ అనసూయ వరుస సినిమా అవకాశాలతో బిజీ అవ్వడంతో టీవీ షోస్‌కి గుడ్‌బై చెప్పేసింది. మళ్ళీ మంచి ఆఫర్ వస్తే బుల్లితెరపై అడుగు పెడతానని ఈ హాట్ యాంకర్ చెబుతోంది. అప్పటిదాకా కాస్త ఖాళీ దొరికినా ఈ ముద్దుగుమ్మ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలే హాలీడే ట్రిప్‌కి వెళ్లిన అనసూయ ఒక హోటల్‌కి వెళ్లి అక్కడ ఉన్న వెయిటర్లతో కలిసి ‘రా రా రక్కమ్మ..ఎక్క సక్క ఎక్కా సక్కా…’ అనే పాటకి స్టెప్పులు వేసింది. వెయిట్రెస్‌తో కలిసి అనసూయ వేసిన డాన్స్ వీడియో ఇంటర్నెట్ లో విస్తృతంగా చక్కర్లు కొడుతుంది.

ట్రావెల్ చేస్తూ అలసిపోయి చిట్యాలలో ఒక ప్లాజా దగ్గర ఆగారు. అక్కడ ఉన్న వెయిటర్లతో అనసూయ కోసం డ్యాన్స్ వేసి ఆమెని వెల్కమ్ చెప్పారు. దాని తరువాత బాగా ఫేమస్ అయిన ‘రా రా రక్కమ్మ’ పాటకు అనసూయ కూడా వారితో చిందులేసింది. అక్కడ ఉన్న వెయిటర్లతో కలిసి అనసూయ చేసిన డ్యాన్స్ వీడియోని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అనసూయ డ్యాన్స్ చూసి అందరూ ఖుషి అవుతున్నారు. రంగమ్మత్త రచ్చ మాములుగా లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.

జబర్దస్త్, సూపర్ సింగర్ జూనియర్ షోల హోస్ట్‌గా చేసిన అనసూయ ఇప్పుడు వాటి నుంచి ఫ్రీ అయిపోయింది. కాగా ప్రస్తుతం అనసూయ చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగు, తమిళం, మలయాళ సినిమాలలో నటిస్తుంది. ఇంతవరకు బానే ఉంది కానీ ఆమె అభిమానులు మాత్రం అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు. అనసూయ గ్లామర్ షో చేయడం లేదని ఫీల్ అవుతున్నారు. మరి అనసూయ తన అభిమానుల కోసమైన గ్లామర్ షో చేస్తుందేమో చూడాలి.

Share post:

Latest