ఊర్వశివో..రాక్షసివో.. ఈ నటీనటుల కెరియర్ మార్చేసిందా..!!

అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ కలిసి నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. ఇక ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కోసం ఈ హీరో, హీరోయిన్ దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరో హీరోయిన్ల కెరియర్ మార్చిందేమో ఒకసారి తెలుసుకుందాం.

Urvasivo Rakshasivo Release Date, Star Cast, Trailer, Plot & More Updates  Here - JanBharat Times

ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాకేష్ శశి దర్శకత్వం వహించారు. ఇక ఇందులో సునీల్, వెన్నెల కిషోర్, ఆమని తదితరులు నటించారు. ఈ సినిమాలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ నటించారు. ఈ సినిమా రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించారు. ఊర్వశివ రాక్షసివో సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ లుక్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఎట్టకేలకు ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.

Urvasivo Rakshasivo (2022) - Movie | Reviews, Cast & Release Date in  chennai - BookMyShow
కథ విషయంలోకి వస్తే ఇందులో అల్లు శిరీష్ శ్రీ కుమార్ పాత్రలో నటించారు. తన ఆఫీసులో పనిచేసే అమ్మాయి సింధు ( అను ఇమ్మాన్యుయేల్) ప్రేమలో పడతారు. సింధు మాత్రం శ్రీ ను ప్రేమించదు. ఇక ఈ విషయం శ్రీ కి తెలియదు. అయితే వీరిద్దరి మధ్య రొమాన్స్ మాత్రం చాలా హద్దులు మీరు పోయి నటించారని టాక్ వినిపిస్తోంది. శ్రీ.. అనుతో సమయం గడపడం కోసం ఇంటికి కూడా ఆలస్యంగా వెళ్తూ ఉంటారు.అయితే ఒకసారి వీరిద్దరూ బాగా క్లోజ్ అవుతారు. ఆ సమయంలో శ్రీ తన మనసులో మాట సింధుకు చెప్పేస్తాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు.. కానీ సింధు మాత్రం నేను నిన్ను ప్రేమించలేదు నిన్ను ఒక ఫ్రెండ్ గా మాత్రమే చూశానని చెప్పి షాక్ ఇస్తుంది.ఇక తర్వాత శ్రీ సింధు మనసుని ఎలా మారుస్తాడు అనే కథ అంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమా లో స్టోరీ నటీనటుల రొమాన్స్ , కథ,బ్యాక్ గ్రౌండ్ సినిమాటోగ్రఫీ ప్లస్ గా మారింది.. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మాత్రమే మైనస్ గా ఈ సినిమాలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టెక్నికల్ పరంగా యూత్ అని ఆకట్టుకునే కథాంశంతో అల్లు శిరీష్ సక్సెస్ కొట్టారని చెప్పవచ్చు.

Share post:

Latest