రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించింది. `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్న రకుల్ కు వరుస పెట్టి టాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన కలిసి నటించి మంచి హిట్లు కొట్టింది. ఆ తర్వాత కాలంలో ఆమె నటించిన కొన్ని సినిమాలు వరస ఫ్లాప్ లు అవడంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. ఆ తరుణంలో రకుల్ కు బాలీవుడ్
ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి.
వచ్చిందే ఛాన్స్ అంటూ రకుల్ అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఈ ఏడాది ఏకంగా ఆమె నటించిన `రన్ వే 34`, `కట్ పుటిల్`, `ఎటాక్`, `డాక్టర్ జి`, `థ్యాంక్ గార్డ్` అనే ఈ ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా మంచి సక్సెస్ను అందుకోలేకపోయాయి. వరుసగా ఐదు ప్లాప్ సినిమాలు పడినప్పటికీ కూడా రకుల్ కి మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలే ఉన్నాయి. మరో ఐదు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.
బాలీవుడ్ లో ‘ఛత్రివాలి’, ‘మేరె పత్ని కా రీమేక్’, తమిళంలో శివకార్తికేయన్ ‘అయలాన్’, ‘ఇండియన్2’ అలానే ఓ బైలింగ్యువల్ సినిమాలు నటిస్తోంది. అయితే వీటిలో కొన్ని సినిమాలు షూటింగ్స్ కంప్లీట్ చేసుకోగా మరికొన్ని షూటింగ్స్ స్టేజ్ లో ఉన్నాయి. ఏదేమైనాప్పటికీ కూడా రిజల్ట్ తో సంబంధం లేకుండా రకుల్ కు మాత్రం వరస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఈ విషయంపై కొందరు మాత్రం లక్ అంటే రకుల్ దే వరుస ఫ్లాపుల్లోనూ కూడా ఆఫర్లు ఆగడం లేదు అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన రకుల్.. వచ్చే ఏడాదిలో మాత్రం ఎలాంటి సినిమాలు చేయాలని విషయంపై దృష్టి పెడతానన్నట్లు అలాగే బోలెడన్ని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు చెప్పుకొచ్చింది. ఇక రకుల్ వచ్చే ఏడాదైనా మంచి సక్సెస్ ను అందుకుంటుందో? లేదో? చూడాలి.