అత‌డి కౌగిట్లో స‌మంత‌.. న‌న్ను నువ్వు ఓడిపోనివ్వ‌వు అంటూ ఎమోష‌న‌ల్‌!

లాంగ్ గ్యాప్ తర్వాత సమంత తాజాగా `యశోద` మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నవంబర్ 11న తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను అందుకుంది.

samantha
samantha

ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సమంత అదరగొట్టేసింది. ఇక టాక్ అనుకూలంగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుత‌మైన వసూళ్లను రాబడుతోంది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నప్పటికీ యశోద ఇచ్చిన సక్సెస్ తో సమంత ఫుల్ జోష్ లో మునిగిపోయింది. ఈ జోష్ లోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

`నాకు ఎంతో ఇష్టమైన జిలేబికి నేను అర్హురాలని అవుతానని జునైద్ ఎప్పుడు ఆలోచించి ఉండడు. కానీ యశోద విజయం సాధించడంతో అతడే స్వయంగా నాకు జిలేబి తెచ్చి నోరు తీపి చేశాడు. గత కొన్ని నెలలుగా నా జీవితంలో అత్యంత దయ‌నీయ పరిస్థితులను చూశావు. అలసట, కన్నీళ్లు అత్యధిక మోతాదు కలిగి స్టెరాయిడ్స్‌ థెరపీల ద్వారా నన్ను దగ్గరగా చూసిన వాళ్లలో నువ్వు కూడా ఉన్నావు.

ఆత్మవిశ్వాసంతో పోరాడేందుకు నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నావు. నాకు తెలుసు భవిష్యత్తులోనూ నన్ను నువ్వు ఓడిపోనివ్వవు.. థాంక్యూ` అంటూ ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేసింది. అలాగే ఈ సంద‌ర్భంగా తన ఫిట్నెస్ ట్రైలర్ జునైద్ కౌగిట్లో ఉన్న ఫోటోను కూడా పంచుకుంది. దీంతో స‌మంత పోస్ట్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Share post:

Latest