పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ఎవరు?

షాక్ తింటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఇపుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది. ప్రముఖ టాలీవుడ్ యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ గురించి తెలుగు కుర్రాళ్ళకి బాగా తెలుసు. ప్రస్తుతం యితడు కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, జాతి రత్నాలు లాంటి సినిమాలతో రాహుల్ రామకృష్ణ బాగా ఫేమస్ అయ్యాడు. ఇటీవల రాహుల్ రామకృష్ణ RRR చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి కూడా తెలిసిందే.

కాగా కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాహుల్ ప్రస్తుతం మంచి బిజీగా వున్నాడు. ఈ క్రమంలో రాహుల్ నెటిజన్లకు ఊహించని ట్విస్టు ఒకటి ఇచ్చాడు. అవును, అదేమంటే తాను త్వరలో తండ్రి కాబోతున్నట్లు రాహుల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టడంతో అదికాస్త వైరల్ అవుతోంది. దాంతో నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తన భార్య గర్భవతిగా ఉన్న పిక్ షేర్ చేస్తూ.. ‘మీట్ అవర్ లిటిల్ ఫ్రెండ్’ అని కామెంట్ పెట్టాడు. తాను త్వరలో తండ్రి కాబోతున్న విషయాన్ని ఇలా ప్రకటించాడు.

అయితే రాహుల్ పెళ్లి విషయంలో నెటిజన్లను ఓ ప్రశ్న తెలెత్తుతోంది. పెళ్లి ఎప్పుడు అయింది బ్రో? అంటూ ఫన్నీగా అతగాడిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది మే తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెబుతూ తన భార్యకి లిప్ కిస్ ఇస్తున్న పిక్ ఇటీవలే షేర్ చేసిన సంగతి తెలిసినదే. ఆ తర్వాత పెళ్లి ఊసే లేదు. కాకపోగా ఇపుడు ఏమీ ఎరగనట్టు ఈ పోస్ట్ ఏమిటి? అని కొంతమంది సోషల్ మీడియా వేదికగానే అడుగుతున్నారు. అలాగే ఒకపక్క కొంతమందిని సినిమా ప్రేక్షకులు మాత్రం రాహుల్ తండ్రి కాబోతుండడంతో శుభాకాంక్షలు చెబుతున్నారు.

Share post:

Latest