కృష్ణ అంత్యక్రియలు ఆలస్యం కావడానికి కారణం అదేనా..!!

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు. కృష్ణ తెలుగు తెరకు సరికొత్త అధ్యాయాన్ని తెరలేపారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆదివారం రోజున కృష్ణ ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ లో చేరగా.. కృష్ణకు హార్ట్ ఎటాక్ రావడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా కూడా కాపాడలేకపోయారు. దీంతో ఈరోజు ఉదయం నాలుగు గంటల సమయంలో కృష్ణ మరణించారు. ఈ విషయం విన్న అభిమానులు, సినీ ప్రేక్షకులు, కృష్ణ కుటుంబం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో సోషల్ మీడియాలో కృష్ణ పై ఎంతోమంది సంతాపం తెలియజేస్తూ ఉన్నారు.

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణకి ఏమైంది… ఆయన ఆరోగ్యంపై ఆందోళన  చెందుతున్న అభిమానులు! – Telugu Online Newsదీంతో మరణ వార్త విన్న కృష్ణ అభిమానులు ఆయన చూసేందుకు బయలుదేరి ఆయన పార్థివ దేహం ఉన్న పద్మాలయ స్టూడియో దగ్గరికి వెళుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అందుకోసం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణ పార్థివ దేహాన్ని గురువారం రోజున అంత్యక్రియలు జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పంజాగుట్ట మహాప్రస్థానంలో అంతక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. బుధవారమే అంతక్రియలు జరగాల్సి ఉండగా అష్టమి కావడంతో ఆ మరుసటి రోజున గురువారం రోజున అంతక్రియలు నిర్వహించబోతున్నట్లు సమాచారం.

ఏది ఏమైనా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఎంతోమంది అభిమానులను సంపాదించడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవరితో కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఉండేటువంటి కుటుంబముగా పేరుపొందింది ఘటమనేని కుటుంబం. ఇక ఎంతోమందికి తమ వంతు సహాయంగా చేస్తూ ఉంటారు. ఇక కృష్ణ స్వగ్రామం బుర్రపాలెంలో ప్రజలు కూడా కృష్ణ కు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఏదిఏమైనా కృష్ణ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

Share post:

Latest