అతడిని ప్రేమించి మరీ వివాహానికి దూరమైన సీనియర్ హీరోయిన్.. ఎవరంటే.

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్, నటి లక్ష్మీ బాగా సుపరిచితమే. ఈమె పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. దాదాపుగా సౌత్ లో అన్ని భాషలలో కూడా మంచి పేరు సంపాదించింది. మొదటిసారిగా తమిళంలో తన సినీ కెరియర్ను మొదలు పెట్టింది. ఇక ఆ తర్వాత తెలుగు కన్నడ ,మలయాళం వంటి బాషలలో కూడా నటించింది. ఇక అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించిన మొదటి చిత్రం జూలీతో మంచి విజయాన్ని అందుకుంది. అలా అందుకోవడమే కాకుండా అక్కడ పలు అవార్డులను కూడా సొంతం చేస్తుంది.

నటి లక్ష్మి బ్యాగ్రౌండ్ కూడా సినీ ఇండస్ట్రీకి చెందినదే. అలాంటి బ్యాగ్రౌండ్ తోనే ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఇ నటి వ్యక్తిగత విషయం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. వాటి గురించి తెలుసుకుందాం.ఇమంది రామారావు మాట్లాడుతూ నటి లక్ష్మీ గారు తన కెరియర్ లో చాలా దూకుడుగా ఉండేదని మంచి విజయాలను అందుకోవడమే కాకుండా మంచి పనులు కూడా ఎక్కువగా చేసేదట. అంతేకాకుండా అందరితో కలిసి ఎక్కువగా జోకులు వేయడం వెకిలిగా మాట్లాడితే మొహం మీదే చెప్పేసేదట.

TeluguCinemaHistory on Twitter: "నటుడు #రంగనాథ్ గారి పాటల్లో మీకు ఇష్టమైన  పాట ? వీలైతే యూట్యూబ్ లింక్ పెట్టండి https://t.co/l7CJKw04NV" / Twitter
ఇక తను ప్రేమించిన మొదటి వ్యక్తిని వివాహం చేసుకున్న ఆ తర్వాత ఆమె విడిపోవడం జరిగింది. ఆ తర్వాత హీరో రంగనాథ్ ను ఇష్టపడిందట. పంతులమ్మ సినిమాలో లక్ష్మీ గారు రంగనాథ్ ఇద్దరు కలిసి జంటగా నటించారు. ఆ సినిమా సమయంలో ఆయన మీద ఇష్టం పెరగడంతో కాస్త చనువు ఇచ్చిందట. అయితే రంగనాథ్ కు అంతకుముందే వివాహమైందట ఈ విషయం కాస్త తన భార్యకు తెలియడంతో.. తన వల్ల ఒక కుటుంబం నాశనం కాకూడదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లక్ష్మి రంగనాథ్ కి దూరమైందట.