అప్పుడు తండ్రి ఇప్పుడు తనయుడు… చిరుకు అదిరిపోయే హిట్స్ ఇచ్చారు..!

చిరంజీవి హీరోగా ఫ్యామిలీ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా హిట్లర్. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది మరి ఎవరో కాదు ఎడిటర్ మోహన్. 1997లో ఈ సినిమా విడుదలై సెన్సేషనల్ హిట్ అయింది. చిరంజీవికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫుల్ ఇమేజ్ తీసుకొచ్చింది కూడా ఈ సినిమానే. నిన్న దసరా కానుకగా విడుదలైన మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని మెగాస్టార్ కు అదిరిపోయే హిట్ ఇచ్చింది.

ఈ సినిమాను డైరెక్ట్ చేసింది హిట్లర్ సినిమాను నిర్మించిన మోహన్ తనయుడు మోహన్ రాజా. ఈ తండ్రి కొడుకులు చిరంజీవితో చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఎడిటర్ మోహన్ నిర్మించిన హిట్లర్ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన సినిమా. ఆ సినిమాను తెలుగులో చిరంజీవితే రీమేక్ చేసి మోహన్ హిట్ కొట్టాడు. ఇప్పుడు అతని తనయుడు తండ్రి బాటలోనే మలయాళం సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాని తెలుగులో చిరంజీవితో గాడ్ ఫాదర్ గా తీసి సూపర్ హిట్ కొట్టాడు.

తండ్రి కొడుకులు చిరంజీవికి రీమిక్స్ తో హిట్ సినిమాలు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి ఎంతో అద్భుతంగా నటించాడు. చిరంజీవి తన పాత సినిమాలు కన్నా ఈ సినిమాల కొత్తగా కనిపించాడు. చిరంజీవి తన నటనతో ఈ సినిమాని వేరే లెవల్ కు తీసుకువెళ్లాడు.

Share post:

Latest