కాంతార చిత్రం ఆ స్టార్ హీరో చేయవలసిందా.. కానీ..!!

ఇటీవల కాలంలో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న చిత్రాలలో కాంతారావు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం అనుకోని విధంగా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అద్దుకోవడమే కాకుండా.. పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంటోంది. ఈ చిత్రం అక్టోబర్ 15న తెలుగులో పాటు ఇతర భాషలలో సైతం విడుదల అయింది. ఇందులో హీరోగా రిషబ్ శెట్టి నటిస్తూనే స్వయంగా దర్శకత్వం వహించారు. తెలుగు రాష్ట్రాలలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. మొదటి రోజు ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం తోపాటు కలెక్షన్ సునామీని సృష్టించింది.

Kantara' movie review: Rishab Shetty bats for folklore and native culture  in his latest - The Hindu
ముఖ్యంగా ఈ సినిమా కన్నడ సాంప్రదాయమైన భూతకోల ఆచారం నేపథ్యంలో ఎంత ఆసక్తికరంగా కాంతారా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా క్రేజ్ ప్రతిరోజు పెరుగుతూనే ఉంది దీంతో ఓటీటిలో త్వరలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇక భాషతో సంబంధం లేకుండా కాన్సెప్ట్ కి కల్చర్ కి కనెక్ట్ అయిపోయారు ఆడియోస్ అని చెప్పవచ్చు. మంచి కలెక్షన్లను రాబట్టి ప్రశంసల వర్షం అందుకుంటోంది.

Puneeth Rajkumar was supposed to act in 'Kantara'; Information that no one  knows » Jsnewstimes

ఇక ఈ చిత్రంలో ముందుగా హీరో రిషబ్ శెట్టి కాదట.. ఈ సినిమాకి రిషబ్ దర్శకత్వంతో పాటు హీరోగా వ్యవహరించారు. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోగా దివంగత నటుడు పునీత్ రాజకుమార్ అనుకున్నారట. అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని ముందుగా అనుకున్నారట. అందుకోసం హోంభలే ప్రొడక్షన్ హౌస్ ని కూడా సంప్రదించారట. అన్ని కుదిరిన తర్వాత పునీత్ రాజకుమార్ సినిమా చేయాలనుకున్న సమయంలో పునీత్ రాజుకు వెళ్లి కలవగా.. ఆ మట్టి వాసన బాగా పండాలంటే నువ్వే హీరోగా నటించాలని సలహా ఇచ్చారట. దీంతో రిషబ్ శెట్టి సినిమాలో హీరోగా నటించారని తెలిపారు.