అదే నిజం అయితే..మెగా ఫ్యామిలీ మరో చెత్త రికార్డ్ ..ఉన్న పరువు పాయే..!?

మెగా ఫ్యామిలీని చప్పట్లు కొట్టి అభినందించే అభిమానులు బోలెడు మంది ఉన్నారు. అలాంటి ఓ చెరగని స్థాయిని మెగా ఫ్యామిలీకి క్రియేట్ చేసి పెట్టారు మెగాస్టార్ చిరంజీవి . ఎవరి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా ఓ నార్మల్ హీరో నుంచి స్టార్ హీరోగా ..ఆ తర్వాత మెగాస్టార్ గా మారి ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏలేస్తున్నాడు . ఇలాంటి ఘనత సాధించడం మామూలు విషయం కాదు.

మనలో ఎంతో టాలెంట్, కృషి పట్టుదల ఉంటేనే ఇలా చేయగలం . కాగా అంత కష్టపడి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న మెగాస్టార్ పరువును తీసేస్తున్నారు కొందరు మెగా డాటర్స్ ,మెగా హీరోస్ . రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మెగా డాటర్ శ్రీజ నెట్టింట ట్రోలింగ్ అవుతూనే ఉంది. ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకుని డీవర్స్ తీసుకున్న శ్రీజ్.. రీసెంట్గా మూడో పెళ్లి కి కూడా సిద్ధమంటూ వార్తలు వినిపించాయి .

మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ ఆఖరి వారంలో శ్రీజ పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఎటువంటి హంగామా లేకుండా ఈ పెళ్లి చేసేయాలని మెగా ఫ్యామిలీ డిసైడ్ అయిందట. అయితే అందుతున్న సమాచారం ప్రకారం మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి కూడా జరగబోతున్నట్టు తెలుస్తుంది. యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మనకు తెలిసిందే ఫారిన్ బ్యూటీతో ప్రేమలో పడ్డ సాయిధరమ్ తేజ ..మెగాస్టార్ కి ఇష్టం లేకపోయినా కూడా ఈ పెళ్లి చేసుకుంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు శ్రీజ మూడో పెళ్లి కూడా మెగాస్టార్ కి ఇష్టం లేదట. ఇలా మెగాస్టార్ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వీళ్లు ఆయనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ఆయన పరువు తీసేస్తున్నారు అంటూ బాధపడిపోతున్నారు జనాలు. ఏది ఏమైనా సరే కొందరు చేసిన తప్పుడు పనుల వల్ల మెగాస్టార్ తన పరువు పోగొట్టుకుంటున్నారు అన్నది మాత్రం వాస్తవం అంటున్నారు మెగా ఫాన్స్.