హీరో అబ్బాస్ కెరియర్ పతనం అవ్వడానికి కారణం అదేనా..?

సినీ పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పడం చాలా కష్టం.ఒక్కసారి గా జీవితాలు ఓవర్ నైట్కే తలకిందులు అవుతాయి. మరికొందరి జీవితాలు స్టార్లుగా మారే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు హిట్ ఫ్లాపులను ఒత్తిడి పరాజయాన్ని తట్టుకుంటూ కెరియర్ను కొనసాగించేవారు కూడా చాలామంది ఉన్నారు. తనకు వచ్చిన పేరు అభిమానాన్ని తక్కువ సమయంలోనే కోల్పోయి కెరియర్ను సంపాదన తమ జీవితాన్ని అయోమయంలో వేసుకున్న వారిలో హీరో అబ్బాస్ కూడా ఒకరు. 1990 లో అబ్బాస్ పేరు అంటే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడేవారు.

The Top Abbas And Erum Ali Daughter

1996 లో అబ్బాస్ నటించిన ప్రేమదేశం చిత్రం విడుదలై పలు రికార్డులను సైతం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలలోనే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ సినిమాని స్పెషల్ షోలు వేయించుకొని చూశారట. అప్పట్లో దర్శక నిర్మాతలు సైతం అబ్బాస్ సినిమా డేట్ల కోసం క్యూ కట్టేవారట. అబ్బాస్ అలా కొన్ని సినిమాలలో నటించి బాగానే అలరించిన ఆ తర్వాత కథలు వినకుండా కేవలం డబ్బు కోసం వచ్చిన ఆఫర్లు అన్నిటిని ఒకే చెప్పడంతో అబ్బాస్ కెరియర్ ఒక్కసారిగా తలకిందులైందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Mirza Abbas Ali movies, filmography, biography and songs - Cinestaan.com
ఇక శంకర్ జీన్స్ కథతో అబ్బాస్ వద్దకు రాగా తన డేట్స్ ఖాళీగా లేవని నో చెప్పడం జరిగిందట. ఇక అలా ఎన్నో సినిమాలను వదులుకొని చివరికి చిన్న చిన్న పాత్రలలో సీరియల్స్ లో నటించారు. అవసరాలు భరించలేక ఒక డిజైనర్ను వివాహం చేసుకొని స్విజర్లాండ్ కు వెళ్లిపోయారు. తెలుగులో అనేక సినిమాలలో నటించిన అబ్బాస్ అతి తక్కువ సమయంలోనే తన కెరియర్ ముగిసిపోయిందని చెప్పవచ్చు తనకున్న టాలెంటును సరిగ్గా వినియోగించుకోవాలని ఉంటే ఇప్పటికి స్టార్ హీరోగా కొనసాగే వారు.