బన్నీ చేతి పై ఉన్న ఈ టాటూ పేరు ఎవరిదో తెలుసా..? దాని వెనుక ఉన్న అస్సలు సీక్రేట్ ఇదే..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఇదో ఫ్యాషన్ అయిపోయింది . ఇష్టమైన వారి పేర్లు, ఇష్టమైన సంఘటన గుర్తు తాలూకా తేదీలు , ఇష్టమైన వాళ్ళ తాలూకా బొమ్మలను చేతిపై బాడీ పార్ట్స్ పై చెరిగిపోకుండా టాటూ వేయించుకుంటారు . సినీ ఇండస్ట్రీలో ఉండే సినీ స్టార్ సెలబ్రిటీసే కాదు చాలామంది ..బిగ్ సెలబ్రిటీస్ కూడా ఇలా తమ బాడీ పార్ట్స్ పై తమకి ఇష్టమైన వ్యక్తుల బొమ్మలను పేర్లను తేదీలను టాటూ గా వేయించుకుంటున్నారు.

 

ఆ లిస్టులో మన స్టైలిష్ స్టార్ బన్నీ కూడా ఉన్నాడు . జనరల్ గా స్టైలిష్ స్టార్ ఇలాంటివి పెద్దగా పట్టించుకోడట. కానీ తన లైఫ్ లో ఇంపార్టెంట్ మోస్ట్ లవబుల్ పర్సన్ గా ఉన్న స్నేహ పేరును మాత్రం టాటూగా తన చేతిపై వేయించుకున్నాడట. నిజానికి ఇది పెళ్లికి ముందే బన్నీ వేయించుకున్నాడు . కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు గెస్ చేయలేకపోయారు. పెళ్లి తర్వాత ఈ విషయం బయట పడింది . దీంతో అల్లు అరవింద్, బన్నీ అమ్మగారు కోప్పడ్డారట . అయినా కానీ అది భార్య మీద ప్రేమతో వేయించుకోవడంతో కూల్ అయిపోయారట.

అంతేకాదు, స్నేహ కూడా బన్నీ పేర్లు టాటూ గా వేయించుకుంటానంటే బన్నీ వద్దన్నాడట. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ యమ రొమాంటిక్ . వాళ్ళ భార్య విషయంలో చాలా కేరింగ్ గా ఉంటాడు . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలతో లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం తన బాడీని మార్చుకోబోతున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే షూట్ స్టార్ట్ కాబోతున్న పుష్ప 2 కోసం ఆయన వ్యాయామాలు బాడీ ఫిట్నెస్ ట్రైనర్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమా కోసం బన్నీ ఏకంగా 120 కోట్లు పారితోషకంగా తీసుకుంటున్నాడని తెలుస్తుంది . మరి చూడాలి పుష్ప2 ఎలాంటి హిట్ అందుకుంటుందో..?