Adipurush: గ్రాఫిక్స్ తో అదరగొడుతున్న ప్రభాస్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు అన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న ప్రతి ఒక్క సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించడం జరుగుతోంది. ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆది పురుష్ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకున్నది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడుగా నటించబోతున్నారు. దీంతో ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొంది.

Adipurush: Prabhas and Kriti Sanon wake up fans with a major announcement.  Find out | Celebrities News – India TV
ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్నారు. రీసెంట్గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ప్రేక్షకులను కూడ బాగానే ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడం జరిగింది. అయోధ్యలో సరయు నది తీరంలో ఈ సినిమా టీజర్ను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమా టీజర్ 1:40 నిమిషాల నిడివితో ఎంతో అద్భుతంగా ఉన్నది.

శ్రీరాముని గా ప్రభాస్ కనిపించిన తీరు ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంటుంనది. టీజర్ లో కనిపించిన షార్ట్ చూస్తుంటే ఇదొక విజువల్ వండర్లా కనిపిస్తోందని చెప్పవచ్చు. రామసేతుపై శ్రీరాముని గెటప్ లో ప్రభాస్ నడిసొస్తున్న తీరు లంకేస్ గా సైఫ్ అలీ ఖాన్ హైలైట్ గా కనిపిస్తూ ఉన్నారు. సీతా లక్ష్మణుడు హనుమంతుడు క్యారెక్టర్ ను కూడా ఈ టీజర్లు చూపించడం జరిగింది. ఇక సీతగా కృతి సనన్ ఎంతో అద్భుతంగా నటిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి టీజర్ కూడా వైరల్ గా మారుతోంది. మరి ఏ మేరకు ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.

Share post:

Latest