జపాన్ లో RRR ప్రమోషన్స్.. జపాన్ ఫుడ్‌ను ఆరగిస్తున్న చరణ్-ఉపాసన!

ప్రముఖ టాలీవుడ్ ఫిలిం RRR సినిమా సృష్టించిన సునామి అంతాఇంతా కాదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియానే కాదు, యావత్ ప్రపంచాన్ని షేక్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, యంగ్ టైగర్ NTR కొమురం భీమ్ పాత్రలో దుమ్ము లేపేశారు. ఈ చిత్రం మార్చి 24 విడుదలై వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకొని ప్రస్తుతం ఆస్కార్ రేసులో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడటం గమనార్హం. ఇక మరోవైపు ఈ సినిమా ఇప్పుడు జపాన్‌లో విడుదలకు సిద్ధమౌతోంది.

RRR సినిమా అక్కడ అక్టోబర్ 21న విడుదలకానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్, ఉపాసన జపాన్‌కి వచ్చారు. అంతేకాకుండా వారు ప్రస్తుతం అక్కడి లోకల్ ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ పిక్‌ను ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ పిక్ వైరల్‌గా మారింది. అలాగే RRR ప్రమోషన్ కోసం రాజమౌళి టీమ్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ సైతం జపాన్ బయలు దేరిన విషయం తెలిసినదే.

రామ్‌ చరణ్ ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాడు. దీనిని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో ఓ కీలకమైన పాత్రలో నటి ఖుష్బూ కనిపించనుందని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇక ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్‌.. రామ్ చరణ్ డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నారు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా కనిపంచనుండగా.. మరో పాత్రలో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏపీలోని రాజమండ్రి పరిసరప్రాంతాల్లో జరుగుతోంది.