యాంకర్ శ్రీముఖి తాజాగా వేసుకున్న డ్రెస్ చూడండి… ఎక్కడైనా ఇలాంటిది చూసారా?

యాంక‌ర్ శ్రీముఖి గురించి తెలుగు కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ బొద్దుగుమ్మ బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే మరోవైపు అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరుస్తూ ఉంటుంది. శ్రీముఖి ఏ షో చేసినా తన అల్లరి చిల్లరి చేష్టలతో కనుల విందు చేస్తుంది. అందుకే శ్రీముఖిని ఆమె ఫ్యాన్స్ ముద్దుగా బుల్లితెర రాములమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం వరుస షోలతో బిజీగా ఉన్న శ్రీముఖి తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకుంది.

విషయం ఏమంటే, శ్రీముఖి సైమా అవార్డ్స్ ఫంక్షన్‌ను ఆలీతో కలిసి హోస్ట్ చేసిన సంగతి తెలిసినదే. ఈ ఫంక్షన్‌కు హిందీ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ హాజరైయారు. అవార్డు ప్రదానం చేసిన తరువాత రణవీర్ సింగ్ డయాస్ నుంచి వెళ్లిపోతుండగా.. శ్రీముఖి, రణవీర్ సింగ్‌ను పిలిచి.. ఒక హగ్ కావాలని కోరింది. దీంతో ఆయన శ్రీముఖికి.. హగ్‌తో పాటు ముద్దు పెట్టేసాడు. కాగా దీనికి సంబంధించినటువంటి వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకుంది. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే సదరు వీడియోలో శ్రీముఖి వేసిన డ్రెస్ గురించి ఇపుడు అందరు మాట్లాడుకుంటున్నారు. సదరు బ్లాక్ డ్రెస్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అది అలా ఉంటే శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఫిలింనగర్‌లో గుసగుసలు వినబడుతున్నాయి. బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోనుందని అందరూ భావిస్తున్నారు. శ్రీముఖి సినిమాల విషయానికి వస్తే.. ‘ఇట్స్ టైమ్ టూ పార్టీ’ అనే సినిమా చేసింది. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా వుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న భోళా శంకర్ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించనుంది శ్రీముఖి.