తన అందచందాలతో వేడివేడి సెగలు పుట్టిస్తున్న అనసూయ… తట్టుకోలేకపోతున్న కుర్రాళ్ళు!

ప్రముఖ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగునాట ఆమెకున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసినదే. ముఖ్యంగా కుర్రాళ్ళు అనసూయ అంటే పిచ్చెక్కిపోతారు. జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన అనసూయ అనతికాలంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే టీవీ షోలు చేయడం, మరోవైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేయడం ఈ బొద్దుగుమ్మ నిత్యకృత్యాలు. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ మరోసారి నెటిజన్లకు హాట్ సర్ప్రైజ్ ఇచ్చింది.

అవును, అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. కాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తగ వైరల్ అవుతున్నాయి. వెరైటీగా ఉన్న డ్రెస్ లో అనసూయ స్టన్నింగ్ ఫోజులు ఇస్తూ కుర్రాళ్ళ సహనానికి పరీక్ష పెట్టింది. చిరునవ్వులు చిందిస్తూనే రొమాంటిక్ బాడీ ప్రదర్శనతో మెస్మరైజ్ చేస్తోంది. కాగా అనసూయ ఇస్తున్న ఫోజులు యువత హృదయాలు గాయపడుతున్నాయి. ఇటీవల నెటిజన్లు తనని ఆంటీ అని పిలవడంపై అనసూయ పెద్ద రచ్చే చేసినప్పటికీ, కుర్రాళ్ళు మాత్రం తనని ఆరాధ్యదేవతగా చూస్తున్నారు.

ఇకపోతే పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో మెప్పించిన సంగతి తెలిసిందే. కాగా ఇపుడు పుష్ప పార్ట్ 2 లో కూడా ఆమె రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అవును, పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా సినిమాల ఎంపిక విషయంలో అనసూయ భరద్వాజ్ ఎప్పుడూ తొందరపడదు. కథని బట్టి ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది.పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటించడానికి సిద్ధం అంటోంది.