యాంకర్స్ సుమ, అనసూయ, రష్మి, శ్రీముఖి, ప్రదీప్‌ పారితోషికాలు తెలిస్తే గుండాగి చస్తారు?

టాలీవుడ్ టాప్ యాంకర్స్ సుమ, అనసూయ, రష్మి, శ్రీముఖి, ప్రదీప్‌ గురించి తెలియని తెలుగు ప్రజలు ఉండరంటే అతిశయోక్తి కాదు. వీరిలో ముందు వరుసలో ఉంటుంది సుమ కనకాల. బేసిగ్గా మలయాళీ అయినటువంటి సుమ అచ్చతెలుగు అమ్మాయిలాగా ఇక్కడ కలిసిపోయింది. నిజం చెప్పాలంటే తెలుగు వాళ్ళకంటే కూడా ఈమె తెలుగు భాష చాలా బాగా మాట్లాడుతుంది. టీవీ షోస్ పక్కన బెడితే ఈమె ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లకు బెస్ట్ ఆప్షన్‌ గా నిలుస్తోంది. అలా ఒక్కో షోకి 3 నుండి 4 లక్షలు పారితోషికం అందుకుంటుందని సమాచారం.

ఆ తర్వాత శ్రీముఖి గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు ఆమె రేంజ్‌ బాగా వుంది. రియాలిటీ షోస్‌ల విషయంలో సుమకి పోటీగా తయారైంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం నాలుగైదు షోలకు యాంకర్‌గా చేస్తూనే స్పెషల్‌ ప్రోగ్రామ్‌లకు తనే యాంకర్‌గా చేస్తుండటం విశేషం. కాగా ఈమె ఒక్కో ఎపిసోడ్‌కి 3 లక్షల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటుందని గుసగుసలు వినబడుతున్నాయి. అలాగే జబర్దస్త్ అనసూయ గురించి తెలిసినదే. ప్రస్తుతం అనసూయ ఒక్కో షోకి రూ.2 నుంచి రెండున్నర లక్షలు తీసుకుంటుందని సమాచారం.

ఇక మరో హాట్‌ యాంకర్‌ రష్మి సైతం గట్టిగానే తీసుకుంటోంది. ఒక్కో షోకి(ఎపిసోడ్‌)కి 2 లక్షల నుండి 3 లక్షలు వరకు తీసుకుంటుందని భోగట్టా. ఇకపోతే మేల్‌ యాంకర్స్ లో ప్రదీప్‌ మాచిరాజు టాప్‌లో వున్న విషయం విదితమే. ఒక్కో షోకి ప్రదీప్ 2 లక్షల వరకు తీసుకుంటున్నాడని వినికిడి. ఇక ప్రదీప్‌ తర్వాత రవి యాంకర్‌గా మంచి పేరుతెచ్చుకున్నారు. ఆయన ఒక్కో షోకి లక్ష రూపాయల నుండి 2 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారట. ఈ సందర్భంగా యాంకర్ శ్యామల, మంజుషల గురించి కూడా చెప్పుకోవాలి. వీరైతే ఒక్కో ఎపిసోడ్ కి 70 వేలనుండి 1 లక్ష రూపాయిలవరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది.