సమంత కారణంగా విజయ్ దేవరకొండ ఇబ్బందులు పడుతున్నాడా?

యువ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అర్జున్ రెడ్డి, గీతాగోవిందం వంటి హిట్ సినిమాలతో పాపులర్ అయ్యాడు.. అయితే గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నాడు.. ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన ‘లైగర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ నిలిచింది. తాజాగా విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ ‘ఖుషి’ సినిమాపైనే పెట్టుకున్నారు. ఈ సినిమాకు శివ నిర్వాణా దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ సినిమాతో అటు దర్శకుడు శివతో పాటు సమంత, విజయ్ దేవరకొండ ముగ్గురు హిట్ అందుకుంటారని ఇండస్ట్రీలో టాక్.. అయితే ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం అవుతోంది.. ఈ ప్రాజెక్ట లేటు అవడానికి కారణం సమంత అని తెలుస్తోంది..

ఈ సినిమా దర్శకుడు శివ నిర్వాణ గతంలో ‘నిన్ను కోరి’, ‘మజిలి’ వంటి సినిమాలతో మెప్పించారు. అయితే హీరో నానితో తీసిన మూడో ‘టక్ జగదీష్’ మాత్రం హిట్ అందుకోలేకపోయింది. దీంతో ‘ఖుషి’ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ సినిమా నిరాశ పరచడంతో.. ఈ సినిమాపైనే నమ్మకం పెట్టుకున్నాడు. అయితే సమంత డేట్స్ విషయంలో క్లాస్ వచ్చి ప్రాజెక్టు ఆలస్యం అవుతుందట..

నిజానికి ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాకు సంబంధించి 30 రోజుల పాటు షూటింగ్ పెండింగ్ లో ఉంది. అక్టొబర్ రెండో వారం నుంచి ఖుషీ నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కానీ సమంత డేట్స్ దొరక్కపోవడంతో ఆగినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సమంత షూటింగుల్లో కూడా పాల్గొనడం లేదట. ఒక వేళ అక్టోబర్ లోపల సినిమా షూటింగ్ స్టార్ట్ చేయకపోతే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది.. అదే జరిగితే వచ్చే ఏడాది వేసవి కాలంలో సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం..

Share post:

Latest