రెస్ట్ మోడ్ లో సమంత.. అనుమానాలకు దారి తీసేలా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఎప్పుడూ కూడా బిజీగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిమిషం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ మరింత బిజీగా మారింది. విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ మరోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల పూర్తిగా సైలెంట్ అయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడంతో ఆమె ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో పుకారులు తెరమీదకు వచ్చాయి..Samantha Ruth Prabhu Is Feeling Well And Taking Rest At Home, Reveals The  Actress' Manager - Filmibeat

అనారోగ్యంతో బాధపడుతోందని కొంతమంది కావాలని పుకార్లు పుట్టిస్తే.. మరి కొంతమంది ఏకంగా సమంతను వివాహం చేసుకోమని పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడంతో దాన్నుంచి తప్పించుకోవడం కోసం సమంత తన గర్భసంచిని కూడా తొలగించుకునేందుకు సిద్ధమయ్యింది అనే పుకారు చాలా అనూహ్యంగా తెరమీదకు రావడం గమనార్హం.అయితే సమంత కానీ సమంత సన్నిహితులు కానీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రచారం నిజమేనని ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇక సినీ ప్రేక్షకులైతే నిజంగానే ఆమె ఇలా చేసిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.Samantha new Instagram goofy photosఇక ప్రస్తుతం సమంత విశ్రాంతి తీసుకుంటున్నారని ఈ పుకార్లు ఏవీ నిజం కాదని త్వరలోనే వీటిపై అధికారికంగా స్పందిస్తారని వారు క్లారిటీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. జూలై చివరిలో ఆమె ఖుషీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. షూటింగ్ షెడ్యూల్ పూర్తవడంతో అప్పటినుంచి మీడియా కంట పడలేదు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఏమాత్రం యాక్టివ్గా లేకపోవడంతో ఏదో జరిగిందని ప్రచారం మొదలైంది. నిజానికి ఇందులో ఏమాత్రం నిజం లేదు.. ఆమె షూటింగ్స్ లేక ఖాళీగా ఉండడం వల్లే ఇలా విశ్రాంతి తీసుకుంటుంది అనే వార్త తాజాగా తెర మీదకు రావడం గమనార్హం.

Share post:

Latest