అక్కినేని ఫ్యామిలీ కి ఆ కోరిక తీరిపోయిందోచ్..ఫ్యాన్స్ కు పండగే..!!

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన నాగార్జున తన తండ్రి లాగానే నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమంలో అగ్ర హీరోగా కొనసాగుతూవచ్చారు. ఆయన తర్వాత వారసులుగా నాగచైతన్య, అఖిల్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇద్దరూ సినిమాలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు.

Manmadhudu 2': Naga Chaitanya or Akhil Akkineni? | The News Minute

అయితే అక్కినేని ఫ్యాన్స్ కి మాత్రం ఒక కోరిక అలానే ఉండిపోయిందట. నాగార్జున సీనియర్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. అయితే నాగచైతన్య, అఖిల్ మాత్రం ఇప్పుడు ఉన్న హీరోలకి పోటీ ఇవ్వలేకపోతున్నారు. వారు తీసిన సినిమాలు ఏవి ఇప్పటివరకు రు. 100 కోట్లు మార్కునుదాటలేదట. ఈ కోరిక ఎప్పుడు తీరుద్ది అంటూ అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య బాలీవుడ్ లో నటించిన లాల్ సింగ్ చడ్డాతో అయినా ఈ కోరిక తీరుతుంది అందరూ అనుకున్నారు.

కానీ ఈ సినిమా డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఇందులో నాగచైతన్య నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమాతో నాగార్జున అక్కినేని అభిమానుల కోరికను తీర్చినట్టు తెలుస్తుంది. ఈ బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున ఒక కీలక పాత్రలు నటించాడు.ఈ సినిమాలో ఆయన అనీష్ శెట్టి అనే ఒక సైంటిస్ట్ పాత్రని పోషించాడు. ఆయన పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఇంటర్వెల్ సీన్ వరకు బ్రహ్మాస్త్ర మూవీ చాలా ఇంట్రెస్టిగా ఉందనే అంటున్నారు.

Alia Bhatt shares new motion poster of Nagarjuna from Brahmastra - Watch! |  Movies News | Zee News

ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ కు బాలీవుడ్ లో కూడా మంచి మార్కులు పడ్డాయి. గతంలో కూడా నాగార్జున కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన అవి ఆయనకు అంత పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయితే ‘బ్రహ్మాస్త్ర’ మాత్రం నాగార్జునకు రెండు విధాలుగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అక్కినేని అభిమానుల కోరిక ఈ సినిమాతో నెరవేరిందని చెప్పవచ్చు ఈ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటుకుని మరి దూసుకుపోవటంతో నాగార్జున కెరియర్ లో ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ సినిమాగా మిగిలిపోయింది అని అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest