అది వెళ్ళాకే నాగచైతన్య సంతోషంగా ఉన్నాడు.. సమంత పై ఘాటు కామెంట్స్ చేసిన నాగార్జున..!

సమంత – నాగచైతన్య.. ఇద్దరూ కూడా ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే వీరి స్నేహం మొదలై ప్రేమకు దారి తీసింది. ఇకపోతే నాగచైతన్య తో ప్రేమలో పడిన సమంత పెద్దల అంగీకారం ప్రకారం రెండు మత ఆచారాల మేర వివాహం చేసుకున్నారు. ఇక వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న వీరు కొన్ని కారణాలు వల్ల విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక వీరి విడాకులతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇప్పటికి కూడా వీరు ఒకటి కలవాలి అని.. కోరుకునే అభిమానులు, సినీ ప్రముఖులు కూడా ఉన్నారటంలో సందేహం లేదు.

Nagarjuna: Even I read reviews and decide to watch! - English
ఇప్పటివరకు వీరు విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఎవరు తెలియజేయకపోవడమే గమనార్హం. ఇక అటు నాగ చైతన్య కానీ ఇటు సమంత కానీ ఎవరూ కూడా విడాకులు తీసుకోవడానికి గల కారణాలు తెలియజేయలేదు. నాగార్జున కూడా ఇప్పటివరకు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు తెలియజేయలేదు. ఇద్దరు గౌరవంగానే విడిపోయాము.. చెప్పాల్సింది చెప్పేసాము అని కూడా చెప్పారు. అయితే ఎవరు కూడా విషయాన్ని అంత త్వరగా స్వీకరించలేకపోతున్నారు . ఇకపోతే రీసెంట్గా బ్రహ్మస్త్ర సినిమా సక్సెస్ సందర్భంగా నాగార్జున ముంబై వెళ్ళినప్పుడు అక్కడ సమంత చైతన్య విడాకుల ప్రస్తావన రాగా సమాధానం తెలియజేసే ప్రయత్నం చేశారు..

Brahmastra star Nagarjuna reacts to Naga Chaitanya-Samantha Akkineni's  separation: 'We can't keep moping...'
స్టేజ్ పై నాగార్జున మాట్లాడుతూ.. నాగచైతన్య హ్యాపీగా ఉన్నాడు.. నేను దాన్ని చూస్తున్నాను.. అది నాకు చాలు.. ఇప్పుడు మేము విడాకుల విషయం గురించి ఆలోచించడం లేదు.. తమ జీవితాల నుంచి అది వెళ్ళిపోయింది. అలాగే అందరి జీవితాల్లో నుంచి వెళ్ళిపోతుందని ఆశిస్తున్నాము అని.. సమంత గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు నాగార్జున.. ఇక విడాకుల తర్వాత నాగచైతన్య కంటే సమంత పైన ఎక్కువ విమర్శలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో ఆ విమర్శలు శృతిమించడంపై సమంత కూడా ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఇటు నాగచైతన్య వారి వారి సినిమాలు వెబ్ సిరీస్ లలో బిజీగా ఉన్నారు. మరొకవైపు సమంత దైవస్మరణ చేస్తూనే మరొకవైపు ఎంతో మందిని ఆదుకుంటుంది. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా కూడా ఎంతోమందికి ఆశ్రయాన్ని కల్పించింది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest