మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్‌… వావ్ కేక పెట్టించే కాంబినేష‌న్‌…!

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో యువరాజుగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత మహేష్ బాబు చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వడంతో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకొని తండ్రికి తగ్గ కొడుకు అని అందరితో అనిపించుకున్నాడు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరిలో మహేష్ బాబు నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు.

రీసెంట్ గా వచ్చిన సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మహేష్. ఇక తర్వాత త‌న 28వ సినిమాని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాను 2023 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తన అభిమానుల డ్రీమ్ కాంబో అయిన రాజమౌళి డైరెక్షన్లో పని చేయబోతున్నాడు మహేష్. ఆ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఆ సినిమా స్టోరీ గురించి కూడా అప్డేట్స్ బయటికి ఇచ్చాడు రాజమౌళి.

రాజమౌళి ఇచ్చిన అప్డేట్ తో ఆ సినిమాపై అంచనాలు మరో స్థాయికి వెళ్ళాయని చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏమిటంటే రాజమౌళి -మహేష్ బాబు సినిమాలో మహేష్ కు జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తుందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. దీనిపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. అయితే దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

Mahesh Babu To Play Lord Rama Opposite Deepika's Sita?

Share post:

Latest