అందాల నటి మీనా మళ్లీ మొదలు పెట్టిందా?

నిన్న మొన్నటి అందాల నటి మీనా గురించి తెలియని తెలుగువారు వుండరు. అందంతో కూడిన ఆమె అభినయం అంటే తెలుగునాట అప్పట్లో యమ క్రేజ్ ఉండేది. పెళ్లి చేసుకున్నాక అమ్మడు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఇప్పుడిప్పుడే మరలా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఇటీవల మీనా భర్త విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా శ్వాసకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ లో మరణించిన సంగతి తెలిసినదే. దీంతో ఒక్కసారి గా మీనా ఫ్యామిలీ పెద్ద దిక్కుని కోల్పోయింది.

గత కొన్ని నెలలుగా షాక్ లో వుండిపోయిన మీనా ప్రస్తుతం కోలుకుని తన కూతురు కోసం తన ఫ్యామిలీ కోసం మళ్లీ సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసింది. భర్త సాగర్ మరణం తరువాత పబ్లిక్ వేదికలైన సోషల్ మీడియాలో కనిపించని మీనా మళ్లీ తాజాగా యాక్టీవ్ అయింది. సాగర్ ఈ ఏడాది జూన్ లో మృతి చెందారు. అప్పటి నుంచి దాదాపు 3 నెలలుగా సోషల్ మీడియాకు దూరంగా వుంటూ వచ్చింది మీనా, రీసెంట్ గా తను అంగీకరించిన సినిమా షూటింగ్ లలో సమయం కేటాయిస్తూ మరలా బౌన్స్ బ్యాక్ అంటోంది.

ఈ సందర్భంగా ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలని అభిమానులతో పంచుకోవడం జరుగుతోంది. తిరిగి సినిమాల్లో నటించడం ప్రారంభించిన మీనా మేకర్స్ ని ఆకట్టుకోవడం కోసం తాజాగా ఫొటో షూట్ లో కూడా పాల్గొంటోంది. ఇకపోతే ఆమధ్య మలయాళం రీమేక్ అయినటువంటి దృశ్యంలో వెంకటేష్ సరసన చేసిన విషయం తెలిసినదే. మరలా దృశ్యం పార్ట్ 3ని తీయబోతున్నారట. దాంట్లో కూడా వెంకటేష్ సరసన మరలా మీనాని చూడబోతున్నాం అన్న మాట.

Share post:

Latest