సమంత యశోద నుంచి బిగ్ అప్ డేట్..!

సమంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న చిత్రం యశోద. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కాస్త గందరగోళం గా ఉందని చెప్పవచ్చు. ఈ నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడడంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యానికి కారణం అవుతోందని సమాచారం. అయితే ఈ సినిమా వాయిదా విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ఈ సినిమా కొత్త విడుదల తేదీ విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.Samantha’s “Yashoda” teaser will be out on September 9

ఇక ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సమంత సినిమా కోసం అభిమానులు తీవ్రమైన స్థాయిలో విమర్శిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు అన్ని మీడియాలో కూడా సమంత యశోద సినిమా టీజర్ విడుదల గురించి పలు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆ టీజర్ విడుదల తేదీలతోపాటు సినిమా విడుదల తేదీ కూడా వస్తే బాగుంటుంది అని అభిమానులు భావిస్తున్నారు. సమంత నటించిన మరొక చిత్రం శాకుంతలం సినిమా నీ కూడా ప్రేక్షకులు మర్చిపోయేలా ఉన్నారు. ఇక ఈ సినిమా విడుదల విషయం కూడా ఇంతవరకు ఎలాంటి అప్డేట్ కూడా లేదు.

ఇక శాకుతలం సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నది. ఇక దాదాపుగా సమంత సినిమా విడుదల కాగా రెండు సంవత్సరాలు పైనే కావస్తోంది. ఇక అంతే కాకుండా అప్పుడప్పుడు సమంత పలు విషయాలపైన సోషల్ మీడియాలో పాపులర్ అవుతూ వస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ వైపుగా తన అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. మరి సమంత ఈ సినిమాలతో సక్సెస్ అయ్యి పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు పొందుతుందో లేదో చూడాలి.

Share post:

Latest