ఆ షోలో రోజాకు ఘోర అవ‌మానం… ఏడుస్తూ బ‌య‌ట‌కు…!

ఆర్కే రోజా అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయనవసరం లేదు. రోజా దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్రను వేసుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన రోజా ఆ తర్వాత రోజుల్లో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలుకు జడ్జిగా వ్యవహరించి బుల్లితెరపై మంచి పాపులారిటీని పెంచుకున్నారు. ఇక తాను ఎమ్మెల్యే కావడానికి ఇప్పుడు మంత్రి కావడానికి పరోక్షంగా జబర్దస్త్ షో కారణమని రోజా భావిస్తారు.

 

రోజా మంత్రి కావడం వల్ల ఈ షోలకు దూరమై.. ఇటీవల ఈటీవీలో దసరా పండుగ కానుకగా ప్రసారం కానున్న `దసరా వైభవం` షో కి గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఈ షోలో పాల్గొన్న రోజా ఆదితో కలిసి స్కిట్ చేశారు. ఆ స్కిట్ లో ఆది రోజాతో మీరు హీరోయిన్, జడ్జి, ఎమ్మెల్యే, మంత్రి అయ్యారని మీలా ముందుకు వెళ్లాలంటే ఏం చేయాలనీ ఆది అడగగా ఇలా కనిపించిన అమ్మాయి వెనక తిరగడం మానేయాలని రోజా చెప్పారు. అప్పుడు ఆది ఇక్కడ మన టీంలో ఎవరెవరికి ఏ శాఖ సెట్ అవుతుందో చెప్పగలరా ? అని అడగగా.. శ్రీముఖికి టూరిజం శాఖ సెట్ అవుతుందని రోజా సమాధానం చెప్పారు.

ఎందుకు శ్రీముఖికి ఆ శాఖ ఇచ్చారంటే శ్రీముఖి అన్ని ఛానల్స్ కు టూర్ కొడుతుందని అందువల్లే ఆమెకు ఆ శాఖ ఇచ్చారని రోజా చెప్పుకొచ్చారు. ఆది తనకే శాఖ సూట్ అవుతుందో అడగగా ఆహార భద్రత శాఖ అని రోజా బదులిచ్చారు. రోజా నీ ఆకలి గురించి బాగా విన్నాను… అందుకే నీకు ఆహార భద్రత శాఖ కరెక్ట్ అని చెప్పుకొచ్చారు. మధ్యలో శాంతి స్వరూప్ నాకే శాఖ ఇస్తారని రోజాని అడగగా నీకు శాఖ కాదు పాక అంటూ హైపర్ ఆది శాంతి స్వరూప్ పై కౌంటర్ వేశాడు.

ఈ క్రమంలోనే నూకరాజు రోజాతో ఏదో అనగా రోజా వెంటనే కోపంతో ఏం మాట్లాడుతున్నావ్..? నన్ను ఈవెంట్ కు పిలిచింది అవమానించడానికా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మీరంతా కావాలని ప్లాన్ చూసుకుని మరీ నన్ను రమ్మని నన్ను ఏడిపిస్తున్నారు అంటూ రోజా బయటికి వెళ్లిపోయింది. అలా ఆ ఈవెంట్లో రోజా కి చాలా పెద్ద అవమానం అనే చెప్పాలి. ఇక దసరా పండుగ రోజున ఉదయం 9 గంటలకు ఈవెంట్ ప్రసారం అవుతుంది. అస్సలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఇక ఈవెంట్ ప్రసారమయ్యే దాకా వేచి చూడాల్సిందే.

Share post:

Latest