విలన్లపై బాలయ్య ఉగ్రరూపం.. ఫైట్ సీన్ వీడియో లీక్..

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 వర్కింగ్ టైటిల్ లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ‘అఖండ’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. బాలయ్య ఈ సినిమాలో మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు.

అయితే టాలీవుడ్ లో లీకుల వ్యవహారం ఎక్కువైపోయింది.. లీకులు స్టార్ హీరోలకు ఇబ్బందికరంగా మారాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న లీకులు మాత్రం ఆగడం లేదు. గతంలో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతున్న RC 15 షూటింగ్ ఇటీవల రాజమండ్రిలో జరిగింది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఆన్ లొకేషన్ లో రామ్ చరణ్ లుక్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో మూవీ మేకర్స్ లీగల్ యాక్షన్ తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీలో కీలక సీన్ కి సంబంధించిన షూటింగ్ ఫొటోలు లీక్ అయ్యింది.

తాజాగా లీకుల బెడద బాలయ్యను కూడా తాకింది. ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన కొన్ని సీన్స్ ని మూవీ యూనిట్ టర్కీలో షూట్ చేస్తోంది. ఈక్రమంలో కొందరు అభిమానులు షూటింగ్ స్పాట్ దగ్గరకు వచ్చి సెల్ఫీలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో బాలయ్య, రౌడీలకు మధ్య ఫైట్ సీన్ నెట్టింట్ వైరల్ గా మారింది. ఈ సీన్ లో బాలకృష్ణ ఒక రౌడీ చేతిని నరికేయగా.. మిగతా రౌడీలు కత్తులతో కనిపిస్తారు. ఈ వీడియో లీక్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సీన్ థియేటర్లు దద్దరిల్లేలా చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు. అయితే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి సీన్ లీక్ కావడంతో మూవీ మేకర్స్ ఫీల్ అవుతున్నారు..