‘లైగ‌ర్’ ప్రీమియ‌ర్ షో టాక్‌..బిగ్ రాడ్ దింపేసిన పూరి మామ..!!

రౌడీ హీరో అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూసిన లైగర్ మూవీ కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పూరి జగన్నాధ్ చాలా కసి మీద ఈ సినిమాను తీశాడు. దానికి తగ్గట్టే ప్రమోషన్స్ పనులు కూడా ఓ రేంజ్ లో డబ్బులు ఖర్చు చేసి భారీ స్థాయిలోనే లైగర్ సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. కానీ సినిమా బొమ్మ పడ్డాక సీన్ మాత్రం వేరేగా ఉంది. ముందు నుంచి పాజిటివ్ కామెంట్స్ వినిపించిన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ఫస్ట్ షో పడగానే సడెన్ గా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఫస్ట్ షో కంప్లీట్ చేసుకున్న లైగర్ మూవీని చూసిన జనాలు బయటికి వచ్చి సినిమా ఎలా ఉందో చెబుతున్నారు. దీంతో లైగర్ మూవీ టాక్ ట్రెండింగ్ గా మారింది


లైగర్ మూవీ విషయానికొస్తే..స్టోఋఈ అంతా పాత చింతకాయ పచ్చాడి లానే ఉంది. కానీ, విజయ్ దేవరకొండ నటన మాత్రం పిక్స్ లో ఉన్నట్లు జనాలు చెప్పుకొస్తున్నారు. కచ్చితంగా అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఈ సినిమాలో తన నటనపై పూర్తి స్థాయి ఫోకస్ చేశాడని జనాల రివ్యూ ఇస్తున్నారు. అనన్య అందాలు ఈ సినిమాని ఓ మెట్టు ఎక్కిస్తాయని అందరూ భావించిన సినిమాకి ఆమె అందాలే ఫ్లాప్ అంటూ జనాలు రివ్యూ ఇస్తున్నారు . మరి ముఖ్యంగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ విషయంలో ఫ్లాప్ అయినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట్ర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఈ సినిమా విషయంలో మాత్రం ఆ డేర్ చూపించలేకపోయాడు. తీసిన స్టోరీని మళ్లీ తీశాడు అంటూ నెగిటివ్ కామెంట్ కూడా వినిపిస్తుంది.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెప్పే కామన్ డైలాగ్ “పూరి మార్క్ ఇది కాదు.. ఒకప్పుడు ఇడియట్, పోకిరి సినిమాలో తీసింది ఈయననేనా.. ఇంత పరమ చెత్త సినిమా పూరి ఎలా డైరెక్ట్ చేయగలిగాడు” అంటూ అభిమానులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ముందు నుంచి అనుకున్నట్టు లైగర్ మూవీ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి స్టోరీనే.. కానీ పూరీ తనదైన స్టైల్లో అక్కడక్కడ మసాలాలు దట్టించి దోసెలు తిరగేస్తూ కథలో అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని సీన్స్ యాడ్ చేయడం సినిమాకి భారీ మైనస్ పాయింట్ అయింది .

అంతేకాదు విజయ్ దేవరకొండ అనన్య లవ్ స్టోరీ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. కచ్చితంగా ఇది పూరిస్తాయి మార్క్ కాదు అంటున్నారు జనాలు . మొదటి నుంచి ఈ చిత్రంపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కానీ వాటన్నింటిని పూరి ఒక్క ఫస్ట్ టాక్ తోని తలకిందులు చేసేసాడు. అనన్య పాండే క్యారెక్టర్ కన్నా రమ్యకృష్ణ స్టోరీని బాగుందంటూ జనాలు రివ్యూ ఇస్తున్నారు.పొటెన్షియల్ మూవీ ని అర్థరహితంగా రాయడం వల్లే అంతగా గ్రిప్ లేని సన్నివేశాలను పూరి తెరకెక్కించి.. సినిమాను మరింత దిగజార్చారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తుంది.

పూరి కథను తొక్కేసిన..విజయ్ మాత్రం తన నటనతో కొన్నిసార్లు సినిమాలు పైకి లేపడానికి ట్రై చేశాడని.. కానీ, అది వర్కౌట్ అవ్వలేదని.. కామన్ స్టోరీని తిప్పితిప్పి నాలుగు సినిమాలు కలిపి పూరి జగన్నాథ్ తెరికెక్కించారని.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి తప్పిస్తే ఈ సినిమా మరొకరికి నచ్చదని అభిమానులు ముఖానే చెప్పేస్తున్నారు . మొత్తం సినిమాలో విజయ్ దేవరకొండ తప్పిస్తే మరెవరు కనిపించరని.. దీంతో విజయం వన్ మ్యాన్ ఆర్మీల ఈ సినిమాను తన భుజాలపై మోసుకొచ్చాడని. కానీ సినిమాల్లో పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలు లేని కారణంగా సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మొత్తంగా ఎంతో ఆశగా కెరియర్ లో హిట్టు పడుతుందని చూసిన విజయ్ కు పూరి జగన్నాథ్ బిగ్ రాడ్ దింపేసాడు అని అంటున్నారు సినిమా చూసిన జనాలు. దీంతో లైగర్ కు భారీ బొక్క తప్పదని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చూడాలి కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

 

Share post:

Latest