నాగచైతన్య, సమంత విడిపోవడానికి ఆ మహిళయే కారణమా.. సెన్సేషనల్ న్యూస్..!

సౌత్ స్టార్ అక్కినేని నాగచైతన్య, సమంత డివోర్స్ తీసుకొని ఇప్పటికే ఏడాది కావస్తోంది. అయితే ఇప్పటివరకు వారు విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటో తెలియరాలేదు. అయితే తాజాగా వారి విడాకుల గురించి ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ప్రకారం సామ్, చైతు విడాకులకు నాగార్జున భార్య అమల ప్రధాన కారణం. ఈ వార్తలో నిజమెంత అనేది పక్కనపెడితే ఇప్పుడు ఇది సినీ సర్కిల్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

నాగార్జున అమల కంటే ముందే లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ నాగచైతన్య జన్మించారు. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కూడా నాగచైతన్యను నాగార్జున గారాబంగా చూసుకుంటున్నారు. చైతూ కెరీర్‌లో అన్ని విధాల నాగార్జున సహాయం చేస్తున్నారు. కానీ అమల మాత్రం చైతన్యను అంత ప్రేమగా చూసుకోదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అఖిల్ మీద ఉన్నంత ప్రేమ నాగచైతన్య మీద ఆమెకు లేదని టాక్ నడుస్తోంది.

ఏ విషయంలోనైనా సరే నాగచైతన్య కంటే అఖిల్‌కే ఎక్కువగా అమల ప్రాధాన్యత చూపిస్తుందట. కోడలిగా తన ఇంట అడుగుపెట్టిన సమంతని ఆమె అస్సలు ఓర్వ లేదట. అలాగే చైతన్యను బాగా టార్చర్ పెట్టిందట. అయితే ఆ టార్చర్ భరించలేక చివరికి నాగ చైతన్య ప్రాణంగా ప్రేమించే తన భార్య సమంతను దూరం చేసుకుంటూ వచ్చాడట. చివరికి ఆమెకు విడాకులు కూడా అమల కారణంగానే ఇచ్చాడని సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది.

చైతన్య కంటే ముందే అఖిల్‌కి పెళ్లి చేయాలని ఆమె ప్రయత్నాలు కూడా చేస్తోందట. చైతన్య గురించి అసలు పట్టించుకోకుండా ఆమె చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంతో దేవుడెరుగు గానీ ఈ విడాకులపై నాగచైతన్య కుటుంబం ఒక క్లారిటీ ఇచ్చేంత వరకు ఇలాంటి రూమర్స్ ఇప్పట్లో ఆగేటట్టు లేవు.

Share post:

Latest