ఆ వెబ్ సిరీస్ కోసం వెంకీ కూతురు కూడా వెయిటింగ్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా మాస్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ ఇటీవల కాలంలో అన్నీ మల్టీస్టారర్ మూవీ లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో అత్యధిక మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ మార్కెట్ ను సంపాదించుకున్న హీరోలలో వెంకటేష్ మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు.

ముఖ్యంగా టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా రావడానికి ఆయన మొదటి కారణం. ఇక ఈ క్రమంలోనే తన అన్నయ్య సురేష్ బాబు కొడుకు రానా దగ్గుపాటి తో కూడా ఒక సినిమా చేయాలని ఎదురుచూస్తూ ఉన్నాడు వెంకటేష్. ఇక మొత్తానికి రానానాయుడు అనే ఒక కొత్త వెబ్ సీరీస్ ద్వారా వీళ్ళిద్దరూ కలిసే అవకాశం దొరికింది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించి షూటింగ్ పనులు కూడా పూర్తి అయి ప్రస్తుతం టెక్నీషియన్స్ అందరూ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీ గా పనిచేస్తున్నారు.

ఈ సంక్రాంతికి ఈ ప్రాజెక్టు ను నెట్ ఫ్లెక్స్ లో విడుదల చేయనున్నారు. ఇక వెంకటేశ్వర తో పాటు రానా దగ్గుబాటి ఇద్దరూ కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని ఫోటోలను విడుదల చేసి త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల చేస్తామని.. ఇందుకు చాలా ఆనందంగా ఉంది అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఇకపోతే ఈ ప్రాజెక్టు కోసం ప్రేక్షకులతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఇకపోతే వెంకటేష్ కూతురు కూడా ఒక వైపు తండ్రి.. మరొక వైపు అన్నయ్యను ఇద్దరినీ ఒకే ఫ్రేములో చూడడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక మొదటి సారి రాబోతున్న ఈ దగ్గుబాటి కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది.

Share post:

Popular