RRR సంచలన రికార్డ్..భారతీయ సినిమాకే గర్వ కారణం..శభాష్ రాజమౌళి..!!

యస్..రాజమౌళి ని ఇప్పుడే ఇదే మాట అంటున్నారు. అఫ్కోర్స్ ..రాజమౌళి కి పొగడ్తలు కొత్త ఏం కాదు..కానీ ఈసారి సాధించిన విజయం అలాంటి ఇలాంటిది కాదు..ప్రతి ఇండియన్ గర్వ పడేలా.. ఇది మా సినిమా..మా తెలుగోడు డైరెక్ట్ చేసినా సినిమా అని గర్వంగా చెప్పుకుని కాలర్ ఎగరేసేలా అద్భుతమైన రికార్డ్ సాధించింది..రాజమౌళి తెరకెక్కించిన..రణం రౌద్రం రుధిరం మూవీ. ఇద్దరు బడా హీరోలను పెట్టి సినిమా తీయ్యడమే గొప్ప విషయం అనుకుంటే..చరణ్ లాంటి తారక్ లను పెట్టి సినిమా తీసి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మెప్పించడం అంటే అది మామూలు విషయం కాదు.

రిలీజ్ తరువాత తారక్ పాత్ర సినిమా తక్కువుగా ఉందన్న కామెంట్లు వినిపించినా..కానీ, ఆయన పర్ఫామెన్స్ తో, సినిమా లో ఆయనకి ఉన్న ఇంపార్టెన్స్ తో అభిమానులని మైమరపించాడు..ముఖ్యంగా నాటు నాటు పాటలో తారక్ పర్ఫామెన్స్ కేక..మైండ్ బ్లోయింగ్ అన్న కామెంట్స్ వినిపించాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు.. రాజమౌళిని-తారక్ ని-చరణ్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తూ..ఆకాశానికి ఎత్తేశారు. సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడమే కాకుండా.. రికార్డ్ స్దాయిలో కలెక్షన్స్ సాధించి మరే సినిమా కూడా టచ్ చేయలనంత టాప్ లో కి వెళ్లి పోయింది.

కాగా, రీసెంట్ గా RRR మరో సంచలన రికార్డ్ నెలకోల్పింది. అదేంటంటే.. ప్రముఖ మూవీ డేటా బేస్‌ సంస్థ IMDB ప్రస్తుతం మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాలో టాప్ 5 లో నిలిచిన ఏకైక ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. అంతేకాదు ఈ లిస్ట్‌లో ఉన్న ఇతర హాలీవుడ్ సినిమాలను మించి RRRకే రేటింగ్ రావడం గమనార్హం. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీంతో మెగా నందమూరు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పలువురు ప్రముఖులు టీం కు శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాలో రాజమౌళి ఎఫెక్ట్స్ ప్లస్ అయితే.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ల అభినయం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజమౌళి టేకింగ్‌ ఈ సినిమాను హాలీవుడ్ సినిమాల సరసన నిలబెట్టాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బాక్స్ ఆఫిస్ వద్ద RRR కలెక్షన్స్ సునామీ కొనసాగుతూనే ఉంది.