అఖిల్ రూట్‌లోనే మోక్షజ్ఞ ఎంట్రీ.. మామూలుగా ఉండదట!

నందమూరి అభిమానులు ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న తరుణం అతి త్వరలో రాబోతున్నట్లు తెలుస్తోంది. తమ అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ వారసుడిగా ఆయన కొడుకు మోక్షజ్ఞ తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు మోక్షజ్ఞ చాలా బొద్దుగా ఉండటంతో సినిమాల్లోకి ఇప్పట్లో రావడం లేదని నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

అయితే గతంలో అక్కినేని వారసుడు అఖిల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లుగానే ఇప్పుడు మోక్షజ్ఞ కూడా సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మనం సినిమాలో అఖిల్ కేమియో పాత్రలో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. కాగా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ నటించబోయే సినిమాలో మోక్షజ్ఞ కూడా సేమ్ ఇలాంటి కేమియో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడితో బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ చాలా స్టైలిష్‌గా ప్లాన్ చేశాడట ఈ డైరెక్టర్. అయితే ఈ సినిమా కోసం మోక్షజ్ఞ కూడా చాల ఎగ్జైటింగ్‌గా ఉండటమే కాకుండా తన బాడీ షేప్‌ను మార్చుకుంటున్నాడట. ఇప్పటికే జిమ్‌లో తెగ కష్టపడుతున్న మోక్షజ్ఞ, దర్శకుడు అనిల్ రావిపూడితో ఎక్కువగా సమయం కేటాయిస్తున్నాడట. ఇలా సినిమాల్లో ఎంట్రీ కోసం మెక్షజ్ఞ చేస్తున్న కసరత్తు చూస్తుంటే నందమూరి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు తండ్రి బాలయ్యతో కలిసి మోక్షజ్ఞ రెడీ అవుతున్నారని స్పష్టం అవుతుంది. మరి మోక్షజ్ఞ ఎంట్రీని నందమూరి అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.

Share post:

Popular