వారెవ్వా : పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్..క్రేజీ ఆఫర్ కొట్టేసిన ప్రియమణి..?

ప్రస్తుతం మనం చూస్తున్నట్లైతే ఎక్కువ మంది హీరోలు,హీరోయిన్లు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే సినిమాలల్లో కనిపించడానికే ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. దీనికి రీజన్స్ చాలా నే ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. పాన్ ఇండియా లెవల్ సినిమాలో కనిపిస్తే..ఒక్కే మూవీ ద్వార మూడు నాలుగు భాషల్లో కనిపించే అవకాశం అభిస్తుంది. దీని ద్వార ఎక్కువ పాపులర్ అవ్వచ్చు. మన లక్ బాగుంటే వేరే భాష లో కూడా నటించే అవకాశం దొరుకుతుంది.

అలానే రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేయచ్చు. పాన్ ఇండియా రేంజ్ సినిమా కాబటి బడ్జేట్ విషయాలల్లో వెనకడుగు వేయరు. ఖచ్చితంగా పెట్టినదానికంటే ఢబుల్ వస్తుంది. దీంతో పాన్ ఇండియా సినిమాలో అవకాశం వస్తే ఎవ్వరు వదులుకోవడం లేదు. కాల్ షీట్లు అడ్జెస్ట్ చేసి మరీ స్టార్ డైరెక్టర్లకు ఇచ్చేస్తున్నారు. తాజాగా అలాంటి పనినే చేసింది ప్రియమణి.

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ నెలకొల్పింది. కాగా త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. పుష్ప ది రైజ్ కన్నా కూడా ..పుష్ప ది రూల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవ్వబోతుందట. భామకలాపం సిరీస్ తో హిట్ అందుకున్న ప్రియమణి ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది. అది కూడా ద్రాక్షాయని సిస్టర్ గా సీన్ లోకి ఎంటర్ అవ్వనుందట. నిజానికి సెకండ్ ఇన్నింగిస్ లో ఈ బ్యూటీ చాలా తెలివిగా సినిమాలు చేసుకుంటూపోతుంది. ఈ క్రమంలోనే బడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నా..సుకుమార్ అడిగేసరికి కాల్ షీట్లు అడ్జెస్ట్ చేసి మరీ బన్నీ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిందట. మరి చూడాలి ద్రాక్షాయని సిస్టర్ గా ప్రియ ఎలాంటి పేరు సంపాదించుకుంటుందో..?