అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి..అడ్రెస్ లేకుండాపోయిన స్టార్ హీరోయిన్ ఈమె..!!

సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్. ఒక స్టోరీ రాసుకున్నపుడు కానీ అనుకున్నప్పుడు కానీ మొదట ఓ స్టార్ హీరోనో హీరోయిన్ నో అనుకుంటాం. వాళ్లు ఒప్పుకుంటే సంతోషం..కధ సెట్స్ పైకి వెళ్తుంది. వాళ్ళు ఇతర ఏ కారణాల చేతనైనా ఒప్పుకోలేదా .. ఆ సినిమా మరో హీరో లేదా హీరోయిన్ చేతికి వెళ్తుంది. ఇలా ఓ హీరోయిన్ కాదని మరో హీరోయిన్ చేతికి వెళ్లిన సినిమా చాలా వరకు హిట్లు గా నిలిచాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ గా కూడా నిలిచాయి.

ఒక్కవేళ సినిమా ఫ్లాప్ అయితే మనం సేఫ్ అనుకునే ఆ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్లు..అదే సినిమా హిట్ అయితే..బ్లాక్ బస్టర్ విషయం సాధిస్తే..చారిత్రలోనే నిలిచిపోయే సినిమాను రిజెక్ట్ చేసుకుంటే ఏ హీరోయిన్ అయినా బాధపడాల్సిందే. ఇక అలాంటి తప్పే చేసి..తన సినీ కెరీర్ కి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ గా మలుచుకుంది మ‌ల‌యాళం హీరోయిన్ మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌. యస్.. అమ్మడు పెద్దగా ఎక్కువ సినిమాలు చేయకపోయినా..నటించిన పాత్రల్లో మాత్రం ఒదిగిపోతూ..అభిమానులను తన నటనతో కట్టిపడేస్తుంది. ఎలాంటి పాత్రలు చేశాం అనేది కాదు ముఖ్యం..చేసిన పాత్రకు న్యాయం చేయడం ఇంపార్టెంట్ అంటుంది మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌.

కాగా, కొంత కాలం వరకు బాగా వినపడిన అమ్మడు పేరు సడెన్ గా కనుమరుగైపోయింది. అసలు ఏమైందా అని ఆరా తీస్తే మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ కు క్యాన్సర్ అని బయటపడింది. దీంతో అభిమానులు చాలా బాధపడ్డారు. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధించారు . అయితే అమ్మడు దరిద్రమో లేక బ్యాడ్ లక్ నో తెలియదు కానీ..సరిగ్గా మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ కి క్యాన్సర్ అని తెలిసే రెండు నెలల ముందు అనుష్క హీరోయిన్ గా నటించిన అరుంధ‌తి ఆఫ‌ర్ వచ్చిందట. కానీ అమ్మడు సున్నితంగా ఈ కధను రిజెక్ట్ చేసిందట. అప్పట్లో ఎలాంటి స్టోరీలు సెలక్ట్ చేసుకోవాలో తెలియక.. గ్లామర్ పాత్రలు చేస్తేనే ఇండస్ట్రీలో ఉండగలం అనుకున్న ఈమె అరుంధ‌తి ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఇక ఆ తరువత ఆ అవకాశం స్వీటి చేతికి వెళ్ళడం.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం..చకచకా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిన కోడి రామకృష్ణ..అనుష్క కు మర్చిపోలేని విజయం అందించారు. ఈ సినిమా వచ్చి 13 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు అనుష్కకు ఈ తరహా హిట్ పడలేదు అంటేనే అరుంధ‌తి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఏది ఏమైనా మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ అరుంధ‌తి ఆఫ‌ర్ ను రిజెక్ట్ చేసి సరిదిద్దుకోలేని తప్పు చేసింది అంటున్నారు అభిమానులు.

Share post:

Latest