సినిమాలు మానేసింది అందుకే..భ‌ర్త గుట్టు ర‌ట్టు చేసిన నిహారిక‌!

మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఏకైక హీరోయిన్‌, నాగాబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఒక మనసు` సినిమాతో హీరోయిన్‌గా సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా నట‌న ప‌రంగా మంచి మార్కుల‌నే వేయించుకుంది.

ఇక ఈ భామ గ‌త ఏడాది డిసెంబర్ 9న వెంకట చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుని.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్ హోటల్‌లో నిహారిక, చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి త‌ర్వాత నిహారిక మ‌రే సినిమాలోనూ న‌టించ‌లేదు. అందుకు కార‌ణం ఆమె భ‌ర్తేన‌ట‌.

తాజాగా `ఆలీతో సరదాగా` కార్యక్రమానికి గెస్ట్‌గా విచ్చేసిన నిహారిక.. తాను సినిమాలు చేయ‌క‌పోవ‌డానికి భ‌ర్త చైత‌న్య‌నే కార‌ణం అంటూ గుట్టంతా ర‌ట్టు చేసింది. ఈ షోలో `సాధారణంగా హీరోయిన్స్‌ తమ గోల్‌కి చేరుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారు. కానీ, మీరు ఇంత త్వరగా చేసుకోవడానికి కారణమేంటి?` అంటూ ఆలీ ప్ర‌శ్నించాడు.

అందుకు నిహారిక‌.. `ఈ కాలంలో హీరోయిన్‌లకు పెళ్లి అయినా కెరీర్‌ ఏం మారలేదు. సమంతకు పెళ్లికి ముందు ఎంత క్రేజ్‌ ఉండేదో.. పెళ్లి అయిన తర్వాత కూడా అలాగే ఉంది. ఇక నా విష‌యానికి వ‌స్తే.. మా ఆయనకు నేను సినిమాలు చేయడం ఇష్టం లేదు. అందుకే.. మానేశా.` అంటూ చెప్పుకొచ్చింది. అయితే `నాకు సినిమాలంటే చాలా ఇష్టం. న‌టించ‌లేక‌పోయినా సినిమాలపై ఇష్టంతో ప్రొడక్షన్‌ స్టార్ట్ చేసి.. ప‌లు వెబ్ సిరీస్‌ల‌ను నిర్మిస్తున్నా` అని నిహారిక పేర్కొంది.