జ‌గ‌న్‌లో మార్పు వెనుక కార‌ణాలివేనా.. 

సీఎం చంద్ర‌బాబు 2014లో అధికారంలోకి రావ‌డానికి ఆయ‌న సీనియ‌రిటీనేగాక‌, ఉద్యోగులు కూడా కొంత కార‌ణం! 2004 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోవ‌డానికి కార‌ణం కూడా ఉద్యోగులే! `నేను మారాను. గ‌తంలోలా ఉద్యోగుల‌తో క‌ఠినంగా వ్య‌వహ‌రించ‌ను` అని చంద్ర‌బాబు పదేప‌దే చెబుతూ వారిలో న‌మ్మ‌కం క‌లిగేలా చేశారు. ఇక 2019 ఎన్నిక‌ల్లో అధికారం చేజిక్కించుకోవ‌డానికి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్.. ఇప్ప‌టినుంచే `నేను మారాను` అనే సంకేతాలు ఇస్తున్నారు. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన నేత‌లే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. […]

ప్ర‌శాంత్ ప్ర‌భావం జ‌గ‌న్‌పై ప‌డిందిగా..

`నువ్వు మారాలి.. నీ వ్య‌వ‌హార శైలి మారాలి.. నీ మాట తీరు మారాలి` అంటూ పార్టీలో సీనియ‌ర్ నేత‌లు ఎంత‌మంది చెప్పినా ప‌ట్టించుకునే వారు కాదు వైసీపీ అధినేత,ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌!! నిన్న‌మొన్న‌టి వ‌రకూ టీడీపీ నేత‌లు కూడా ఆయ‌న వ్య‌వ‌హార‌శైలినే టార్గెట్ చేసేవారు!! ఇప్పుడు జ‌గ‌న్ నిజంగానే మారిపోయారు. ఇటీవ‌ల ఆయ‌న పాల్గొన్న సంఘ‌ట‌న‌లు, ఆయ‌న మాట‌తీరు గ‌మ‌నించి వారంతా ఇప్పుడు ఆశ్చర్య‌పోతున్నారు. దీని వెనుక ఏరికోరి తెచ్చుకున్న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌భావం […]

మ‌ల్లాది విష్ణు వైసీపీ ఎంట్రీ… ఆ ఇద్ద‌రికి ఎర్త్ త‌ప్ప‌దా..!

విజ‌య‌వాడ‌కు చెందిన కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీలో చేరడం ఖరారైంది. విష్ణు వైసీపీ ఎంట్రీపై గ‌త ప‌ది రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇక ఇటీవ‌ల నాలుగైదు సార్లు వైసీపీలో చేరే అంశంపై జ‌గ‌న్‌తో ఫోన్లో మాట్లాడుతున్న ఆయ‌న మంగ‌ళ‌వారం లోట‌స్‌పాండ్‌లో జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో చేరుతున్న విష‌యాన్ని క‌న్‌ఫార్మ్ చేశారు. ప‌ది రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని విష్ణు పార్టీ మార‌నున్నారు. ఇదిలా ఉంటే […]

పవన్ సర్వే ఏ పార్టీకి?

2019 ఏపీలో ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రం! అయితే, రాష్ట్రంలోని వివిధ రాజ‌కీయ ప‌క్షాల‌కు మాత్రం రెండేళ్ల ముందుగానే ఎన్నిక‌ల వేడి పుట్టింది! ముఖ్యంగా ఎప్పుడెప్పుడు సీఎం సీటులో కూర్చుందామా అని ఎదురు చూస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే అనే థీమ్‌తో ఇటీవ‌ల ఆయ‌న ఎన్నిక‌ల స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిశోర్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల స‌ర్వే చేయించారు. దీనిలో వైసీపీకి మెజారిటీ సీట్లు రాగా సెకండ్ ప్లేస్ టీడీపీ కొట్టేసింది. ఇక‌, ప్ర‌శ్నిస్తానంటూ […]

వైసీపీలోకి సీనియర్.. అమ‌రావ‌తిలో టీడీపీకి ఇబ్బందే!

విప‌క్షం వైసీపీకి రాజ‌ధాని ప్రాంతం అమ‌రావ‌తిలో గ‌ట్టి ప‌ట్టు దొరుకుతోందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ప్రాంతంలో పార్టీని ముందుండి న‌డిపించ‌గ‌ల నేత వ‌స్తున్నాడా? ముఖ్యంగా టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమాకి.. మొగుడు లాంటి కేండిట్ వైసీపీలోకి వ‌స్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. గ‌తంలో సెంట్ర‌ల్ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన మ‌ల్లాది విష్ణు ఇప్పుడు జ‌గ‌న్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని రెండు మూడు రోజులుగా […]

వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలలో టెన్షన్..టెన్షన్

ఏపీలో వైసీపీ నేత‌ల‌కు ప్ర‌శాంత్ కిషోర్ ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. పార్టీలో ఏ స్థాయిలో ఉన్న‌వారికి అయినా ఈ ఫీవ‌ర్ మామూలుగా లేదు. ఇప్పుడు అంద‌రి నోట ప్ర‌శాంత్ స‌ర్వే మాటే వినిపిస్తోంది. ప్ర‌శాంత్ ఏకంగా రూ. 8 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసి గ్రామ‌స్థాయి గ్రామ‌స్థాయి వ‌ర‌కు రిపోర్టులు త‌యారు చేయించారు. ఈ సర్వే నివేదిక‌లు జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లిపోయాయి. జ‌గ‌న్ కూడా ప్ర‌శాంత్ కిషోర్ చెప్పిన‌వి అన్నీ పాటిస్తున్నాడ‌న్న లీకులు వైసీపీ నాయ‌కులంద‌రికి తెలిసిపోయాయి. దీంతో […]

టార్గెట్ జ‌గ‌న్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ను, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని విడదీసి చూడ‌లేం! అంత‌లా కాంగ్రెస్‌ను త‌న‌లో ఐక్యం చేసేసుకున్నాయాన‌! ఆయ‌న మ‌ర‌ణం తర్వాత వైఎస్ జ‌గ‌న్ రాష్ట్ర రాజ‌కీయాల్లోకి రావ‌డం.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా జ‌గ‌న్ వైపు వెళ్లిపోవ‌డం.. ఇదే స‌మయంలో విభ‌జ‌న జ‌ర‌గ‌డం.. ఇలా దెబ్బ మీద దెబ్బ త‌గ‌లడంతో ఏపీలో కాంగ్రెస్ జాడే లేకుండా పోయింది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి కొంతైనా పుంజుకోవాల‌ని పార్టీ త‌హ‌త‌హ‌లాడుతోంది. ఇదే స‌మ‌యంలో వైఎస్ పేరు చెప్పి.. త‌మ […]

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొస్తే ఏపీ, తెలంగాణ‌లో గెలుపెవ‌రిది…

ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే.. ఇప్ప‌టినుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఇటు టీడీపీ, అటు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేశాయి. కొత్త‌గా రాజ‌కీయ తెర‌పై భ‌విత‌వ్యాన్ని ప‌రీక్షించుకోవాల‌ని నిర్ణ‌యించిన జ‌న‌సేన.. ఈసారి ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది? సీఎం కావాల‌నుకునే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఆశ‌లు ఈసారి నెర‌వేర‌తాయా? అటు టీఆర్ఎస్‌లో మ‌ళ్లీ బ‌లం పుంజుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్ ఆశ‌లు ఎంత‌వ‌ర‌కూ ఫ‌లిస్తాయి? అనే ప్ర‌శ్న‌లు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇప్ప‌టికిప్పుడు […]

ఇప్పుడు చంద్ర‌బాబు టార్గెట్ వాళ్లేనా

అసంతృప్తి.. టీడీపీలో ఈమ‌ధ్య విప‌రీతంగా వినిపిస్తున్న ప‌దం!! క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేర‌యిన టీడీపీలో అసంతృప్తి వ‌ల్ల తీవ్ర అల‌జ‌డి రేగుతోంది. ముఖ్యంగా పార్టీని రాజ‌కీయంగా బ‌లోపేతం చేసేందుకు ఎంచుకున్న `ఆకర్ష్‌` వ‌ల్ల ఇది మ‌రింత తీవ్ర‌మైంది. రెండేళ్లలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో.. ఇదే అసంతృప్తి కొన‌సాగితే.. జంపింగ్‌లు ఎక్కువ‌వుతాయ‌ని దీనివ‌ల్ల‌ పార్టీకి తీవ్ర న‌ష్ట త‌ప్ప‌ద‌ని భావించిన అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. ముఖ్యంగా శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలో చేర‌డంతో వెంట‌నే ఆయ‌న అల‌ర్ట్ అయ్యారు. ఇలా వ‌దిలేస్తే ఇంకా […]