ఏపీలో కులాల పరంగా రాజకీయం చేసి ఓట్లని కొల్లగొట్టాలని అటు వైసీపీ, ఇటు టీడీపీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇటీవల బీసీల పేరిట సభలు పెట్టి..బీసీ ఓట్లకు గేలం వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాపుల ఓట్లపై పడ్డారు. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న కాపు ఓట్లని దక్కించుకోవడానికి రెండు పార్టీలు ట్రై చేస్తున్నాయి. అటు జనసేన సైతం కాపు ఓట్లపైనే ఆధారపడి ఉంది. ఇదే క్రమంలో తాజాగా వంగవీటి రంగా వర్ధంతిని వేడుకగా చేసుకుని కాపుల ఓట్లు కొల్లగొట్టే […]
Tag: chandrababu
కందుకూరుకు బాబు..టీడీపీ సీటు తేలుతుందా?
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇక బాబు ఎక్కడకు వెళ్ళితే అక్కడ జనం భారీ ఎత్తున వస్తున్నారు. రోడ్ షోలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అంతకముందు బాదుడేబాదుడు కార్యక్రమం కావచ్చు. ఇప్పుడు ఇదేం ఖర్మ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇటీవల పశ్చిమ గోదావరి, బాపట్ల, విజయనగరం జిల్లాల్లో బాబు రోడ్ షోలకు పెద్ద […]
ఈ స్టయిల్ మారాలేమో బాబూ…!
రాజకీయంగా నాయకులకు ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత.. కొంత ఇబ్బంది వస్తుంది. అదేంటంటే మాస్ మహారాజు మాదిరిగా ప్రజలను ఆకట్టుకోలేక పోవడం. అంతేకాదు.. ప్రజల మనసుల్లో చోటు సంపాయించుకో వడం. గత కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబును పరిశీలిస్తే.. ఈ రెండు సమస్యలు ఆయన ప్రసంగాల్లో కనిపిస్తున్నాయి. ప్రజలు ఆయన సభలకు వస్తున్నారు. దీంతో ఆయన ఉల్లాసంగా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు చేస్తున్న ప్రసంగాల్లో ఒకింత అగ్రసివ్ నెస్ కనిపిస్తోంది. నేను చేశాను.. నేనే […]
మీడియాతో రాజకీయం..ఎవరి కాన్సెప్ట్ వారిది..!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మీడియానే రాజకీయాలు చేస్తుందా? అనే పరిస్తితి. అంటే ఆ స్థాయిలో మీడియా జోక్యం ఉంది..పైగా పార్టీల వారీగా మీడియా విడిపోయింది. పిల్లలని అడిగిన సైతం ఏ మీడియా..ఏ పార్టీదో చెప్పేస్తారు. అంటే ఆ స్థాయిలో మీడియా కొన్ని పార్టీలకు భజన సంస్థలుగా మారిపోయాయి. ఏపీలో అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీకి అనుకూలమైన మీడియా సంస్థలు ఉన్నాయి. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన […]
తప్పులపై తప్పులు చేస్తోన్న చంద్రబాబు… మళ్లీ బిగ్ రాంగ్ స్టెప్…!
టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు చిత్రంగా కనిపిస్తున్నాయి. తనను నమ్మాలని ఆయన చెప్పడం లేదు కానీ.. పార్టీని బలోపేతం చేయాలని అంటున్నారు. అది కూడా తెలంగాణలోనే. అది కూడా.. మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన చెప్పడం లేదు. పార్టీ నుంచి వెళ్లిన వారు చాలా మంది ఉన్నారని.. వారంతా తిరిగి వచ్చేయాలని ఆయన పిలుపుఇచ్చారు. ఇది మంచిదే అయినా.. ఎంత మంది తిరిగి వస్తారు? వచ్చినా..చంద్రబాబును ఎందుకు నమ్ముతారు? ఎలా నమ్ముతారు? అనేది కీలక ప్రశ్న. […]
విజయనగరంలో బాబు సత్తా..టీడీపీకి అవే ప్లస్.!
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే..ప్రతి జిల్లాలోనూ టీడీపీకి దెబ్బతగిలింది. కొన్ని జిల్లాల్లో ఇంకా దారుణమైన ఫలితాలు వచ్చాయి. నాలుగు జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో దారుణంగా ఓడి ఒక్క సీటు కూడా గెలవలేదు. మామూలుగా సీమ బెల్టులో టీడీపీకి దారుణ ఓటమి వచ్చిన పార్టీ శ్రేణులు తీసుకున్నాయి గాని..పట్టున్న విజయనగరంలో కూడా ఒక్క సీటు కూడా తెచ్చుకోకపోవడం మింగుడు పడని విషయం. […]
తమ్ముళ్ల మధ్య గొడవ పెట్టిన చంద్రబాబు… తన్నుకుంటున్నారుగా…!
తాంబూలాలిచ్చేశాను.. తన్నుకు చావండి! అని కన్యాశుల్కంలో ఒక డైలాగు ఉంది. అచ్చం ఇప్పుడు కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు ఇదే చేస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన డోన్ నియోజకవర్గానికి సంబం ధించి.. నాయకులు తన్నుకులాడుతున్నారు. డోన్ నియోజకవర్గంపై కేఈ కుటుంబం ఆశలు పెట్టుకుంది. కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని తపిస్తున్నారు. అయితే.. ఇంతలోనే చంద్రబాబు డోన్ నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా ధర్మవరం సుబ్బారెడ్డిని నియమిం చారు. కొన్ని రోజుల కిందట […]
తెలంగాణలో 30 సీట్లపై టీడీపీ ఆశలు..ఛాన్స్ ఉందా?
ఒకప్పుడు తెలంగాణ అంటే టీడీపీకి కంచుకోట అన్నట్లు ఉండేది. అక్కడ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది..కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పూర్తిగా దెబ్బతింది. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ బాగానే సీట్లు తెచ్చుకుంది. 15 సీట్లు టీడీపీ గెలిచింది. కానీ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌తో టీడీపీని గట్టిగా దెబ్బతీశారు. ఇక రేవంత్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ లోకి వెళ్ళడంతో..టీడీపీ పతన దశకు వచ్చింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని..కేవలం 2 […]
బొబ్బిలిలో సైకిల్ జోరు..30 ఏళ్ల తర్వాత ఛాన్స్.!
ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం..కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014 వరకు అక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. అయితే ఇక్కడ టీడీపీకి పెద్దగా గెలిచిన సందర్భాలు తక్కువ. 1983, 1985, 1994 ఎన్నికల్లోనే టీడీపీ అక్కడ గెలిచింది. ఇంకా అంతే మళ్ళీ అక్కడ టీడీపీ గెలవలేదు. 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. ఇక ఎప్పుడో 1994లో గెలిచిన టీడీపీకి మళ్ళీ 2024 […]









