త‌ప్పుల‌పై త‌ప్పులు చేస్తోన్న చంద్ర‌బాబు… మ‌ళ్లీ బిగ్ రాంగ్ స్టెప్‌…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేస్తున్న రాజ‌కీయాలు చిత్రంగా క‌నిపిస్తున్నాయి. త‌న‌ను న‌మ్మాల‌ని ఆయ‌న చెప్ప‌డం లేదు కానీ.. పార్టీని బ‌లోపేతం చేయాల‌ని అంటున్నారు. అది కూడా తెలంగాణ‌లోనే. అది కూడా.. మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని ఆయ‌న చెప్ప‌డం లేదు. పార్టీ నుంచి వెళ్లిన వారు చాలా మంది ఉన్నార‌ని.. వారంతా తిరిగి వ‌చ్చేయాల‌ని ఆయ‌న పిలుపుఇచ్చారు.

Sakshi Spins Chandrababu Naidu Video to Create A Rift in TDP

ఇది మంచిదే అయినా.. ఎంత మంది తిరిగి వ‌స్తారు? వ‌చ్చినా..చంద్ర‌బాబును ఎందుకు న‌మ్ముతారు? ఎలా న‌మ్ముతారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌. రాజ‌కీయాలు ఎక్క‌డైనా చేయొచ్చు.. దీనిని కాద‌న‌రు కానీ, కేడ‌ర్‌లో ధైర్యం ఉండాలి.. ధైర్యం నింపాలి. అధినేత కుదురుగా రాజ‌కీయాలు చేయాలి. ఇవి రెండులేకుండా.. వ‌చ్చేయండి అంటే.. నాయ‌కులు పిచ్చివాళ్లయితే కాదు.

Telangana TDP 'Splits Into Two' On 'Poll Alliance' Prior To Early  Elections! | #KhabarLive | Breaking News, Analysis, Insights

వారు కూడా వెనుక ముందు చాలానే ఆలోచ‌న చేస్తున్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా చేతి చ‌మురు బాగానే వ‌దులుతోంది. అదేదో.. నిల‌కడైన పార్టీ అయితే.. బెట‌ర్‌క‌దా! అనేది వారి ఆలోచ‌న .ఈ విష‌యంలో చూసుకుంటే.. టీడీపీ అధినేతగా చంద్ర‌బాబు త‌ప్పుల‌పై త‌ప్పులు చేస్తున్నారు. చేశారు. గ‌తంలో బ‌ల‌మైన టీడీపీ కేడ‌ర్‌ను వ‌దిలేసి.. ఏపీకి వ‌చ్చేశారు. ఏపీలో అధికారంలో ఉన్నారు.

Naidu not critical of BRS, avoids reference to KCR

ఇలాంటి స‌మ‌యంంలో ఆయ‌న తెలంగాణ‌లో కేడ‌ర్‌ను ఆదుకున్నారా? అంటే లేదు. ఓటు కు నోటు కేసు కావొచ్చు.. లేదా మ‌రో వ్య‌క్తిగ‌త కార‌ణంతో కావొచ్చు.. అక్క‌డివారిని అర్ధంత‌రంగా వ‌దిలేసి వ‌చ్చారు. ఎల్‌. ర‌మ‌ణ‌.. టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఏపీ కి వ‌చ్చారు. త‌న‌కు ఏదైనా సాయం చేయాల‌ని అభ్య‌ర్థించారు. లేక‌పోతే.. పార్టీని న‌డ‌పలేన‌ని, పార్టీ మార‌డం త‌ప్ప ప్ర‌త్యామ్నాయం లేద‌న్నారు.

After decimation in last polls, TDP eyeing revival in Telangana

కానీ, చంద్ర‌బాబు చేతులు ఎత్తేశారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇదే చేశారు. మాకు.. కేసీఆర్ నుంచి ఒత్తిడి పెరిగింది.. రాజకీయంగా మ‌న‌లేక పోతున్నాం.. ఏం చేయాల‌ని కోరారు. దీనికి ఆయ‌న పార్టీ మారిపోవాల‌ని స‌ల‌హా ఇచ్చారు త‌ప్ప‌.. పార్టీని ముందుండి న‌డిపిస్తాను. ఏం జ‌రుగుతోందో నేనే చూస్తాన‌ని భ‌రోసా ఇవ్వ‌లేక పోయారు. ఇలాంటి నేత‌ను.. ఇప్పుడు ఎందుకు న‌మ్మాల‌నేది ప్ర‌శ్న‌. గ‌తం చంద్ర‌బాబు మ‌రిచిపోయి ఉండొచ్చు. కానీ, నాయ‌కులు కాదు!!