యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ `18 పేజెస్`. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సుకుమార్ నిర్మాతగానే కాకుండా కథ, స్క్రీన్ ప్లే కూడా అందించారు.
గోపీ సుందర్ స్వరాలు సమకూర్చాడు. హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్,రొమాంటిక్స్ సాంగ్స్ లేని ప్రేమకథా చిత్రం ఇది. డిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తొలి రోజు వసూళ్లను కూడా బాగానే రాబట్టిన ఈ చిత్రం.. ఓటీటీ పార్ట్నర్ ను లాక్ చేసుకుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ `ఆహా` వారు 18 పేజెస్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సాలిడ్ ధరకు సొంతం చేసుకున్నారట.
అంతేకాదు, 18 పేజెస్ ఓటీటీ విడుదలకు స్ట్రీమింగ్ డేట్ ను కూడా లాక్ చేశారని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని ఆహాలో స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఎలాగో సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారసుడు తదితర చిత్రాలు దిగుతున్నాయి. టాక్ ఎంత బాగున్నా వీటి మధ్య 18 పేజెస్ నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ సినిమాను ఓటీటీలోకి దింపి క్యాష్ చేసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.