ధమాకా తో రెమ్యూనరేషన్ పెంచేసిన శ్రీ లీల..!!

టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరు పొందింది శ్రీ లీల. ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లలో టాప్ హీరోయిన్గా చలామణి అవుతొంది. ఈమె ప్రస్తుతం కుర్ర హీరోలు అందరికీ ఫేవరెట్ హీరోయిన్గా మారిపోతోంది. ప్రస్తుతం ఇమే వయసు 20 సంవత్సరాలు అయినా కూడా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. మొదట కన్నడలో రెండు మూడు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులోకి శ్రీకాంత్ కొడుకు నటించిన పెళ్లి సందD సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి చిత్రంతోనే అందంతో నటనతో డాన్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

Heroine Sree Leela And Roshan Discussing About Dance Moves | Pelli SandaD |  Daily Culture - YouTube

ఇక తర్వాత రవితేజతో కలిసి నటించే అవకాశాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ చిత్రమే ధమాకా. ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత హీరో రామ్ పోతినేని తో ఒక సినిమాలో నటించబోతోంది ఆ తర్వాత వైష్ణవి తేజ్ సినిమాలో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరే కాకుండా మరొక హీరో నితిన్ సినిమాలో కూడా ఇమే నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Srileela says tshe plays Pranavi a role in protagonist throughout the film  - YouTubeధమాకా సినిమా కోసం ఏకంగా రూ .40 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాలు ఒప్పుకోవాలి అంటే దాదాపుగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ తొందరగా డేట్లు అడ్జస్ట్ చేసుకొని నటిస్తే రూ.1.5 కోట్లు రెమ్యూనరేషన్ అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలిల డాక్టర్ కాబోయే యాక్టర్ అయిందని చెప్పవచ్చు ఒకవైపు చదువుతూనే మరొకవైపు ఇలా యాక్టింగ్ చేస్తోంది.