మీడియాతో రాజకీయం..ఎవరి కాన్సెప్ట్ వారిది..!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మీడియానే రాజకీయాలు చేస్తుందా? అనే పరిస్తితి. అంటే ఆ స్థాయిలో మీడియా జోక్యం ఉంది..పైగా పార్టీల వారీగా మీడియా విడిపోయింది. పిల్లలని అడిగిన సైతం ఏ మీడియా..ఏ పార్టీదో చెప్పేస్తారు. అంటే ఆ స్థాయిలో మీడియా కొన్ని పార్టీలకు భజన సంస్థలుగా మారిపోయాయి. ఏపీలో అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీకి అనుకూలమైన మీడియా సంస్థలు ఉన్నాయి. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

వైసీపీ అనుకూల మీడియా జగన్‌కు భజన చేస్తూ..చంద్రబాబుపై నెగిటివ్ చేస్తూ ఉంటుంది. టీడీపీ అనుకూల మీడియా ఏమో బాబుని లేపడానికి చూస్తూ..జగన్‌పై విమర్శలు చేస్తూ ఉంటుంది. ఇలా ఎవరి పని వారు చేస్తున్నారు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి ఉంది..ఇటు జగన్ గాని, అటు బాబు గాని తమకు అసలు మీడియా సపోర్ట్ లేదన్నట్లే మాట్లాడతారు. ఈ మధ్య జగన్..పదే పదే జనంలో సెంటిమెంట్ లేపడానికి చూస్తున్నారు.

చంద్రబాబుకు దుష్టచతుష్టయం సపోర్ట్ ఉందని చెప్పి కొన్ని మీడియా సంస్థల పేర్లు చెప్పి..తనకు మీడియా సపోర్ట్ లేదని, దత్తపుత్రుడు లాంటి వారు లేరని చెప్పి..జనమే తనకు అండగా ఉండాలని మాట్లాడుతున్నారు. అయితే చంద్రబాబుకు మీడియా సపోర్ట్ ఉందనేది వాస్తవమే..కానీ జగన్ లేదనేది అవాస్తవం. జగన్‌కు బాకా ఊదే మీడియా సంస్థలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు.

ఇక తాజాగా బాబు కూడా జగన్ బాటలోనే వెళుతున్నారు…వైసీపీ అనుకూల మీడియా పేర్లు చెప్పి..జగన్‌ మాదిరిగా తనకు మీడియా సపోర్ట్ లేదని అంటున్నారు. ఇది అవాస్తవం అనేది అందరికీ తెలిసిందే. మొత్తానికి మీడియా సపోర్ట్ లేదంటూ..బాబు-జగన్ సెంటిమెంట్ రాజకీయం చేస్తున్నారు.