విజయనగరంలో బాబు సత్తా..టీడీపీకి అవే ప్లస్.!

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే..ప్రతి జిల్లాలోనూ టీడీపీకి దెబ్బతగిలింది. కొన్ని జిల్లాల్లో ఇంకా దారుణమైన ఫలితాలు వచ్చాయి. నాలుగు జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో దారుణంగా ఓడి ఒక్క సీటు కూడా గెలవలేదు. మామూలుగా సీమ బెల్టులో టీడీపీకి దారుణ ఓటమి వచ్చిన పార్టీ శ్రేణులు తీసుకున్నాయి గాని..పట్టున్న విజయనగరంలో కూడా ఒక్క సీటు కూడా తెచ్చుకోకపోవడం మింగుడు పడని విషయం.

జిల్లాలో కంచుకోటల్లో కూడా టీడీపీ గెలవలేదు. అయితే ఇదంతా గత ఎన్నికల్లో పరిస్తితి. ఇప్పుడు సీన్ మారింది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది..ఇటు టీడీపీ నేతలు బలపడుతున్నారు. ఇక జిల్లాలో టీడీపీ బలపడిందని చెప్పడానికి తాజాగా చంద్రబాబు టూర్‌కు భారీ స్థాయిలో ప్రజల నుంచి స్పదన రావడమే. మొదట ఉమ్మడి శ్రీకాకుళంలోని రాజాంలో పర్యటించారు. అక్కడ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

May be an image of 4 people and people standing

తర్వాత ఉమ్మడి విజయనగరంలోని బొబ్బిలి, గజపతినగరం, విజయనగరం అసెంబ్లీల్లో పర్యటించారు. ఈ మూడు నియోజకవర్గాల్లో ఊహించని విధంగా ప్రజా స్పందన వచ్చింది. ముఖ్యంగా విజయనగరం అసెంబ్లీలో బాబు రోడ్ షోకు జనం పెద్ద ఎత్తున వచ్చారు. దీని బట్టి చూస్తే విజయనగరంలో టీడీపీ బలపడుతుందని అర్ధం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన వైసీపీ ఇప్పుడు ఆధిక్యం నిలబెట్టుకోవడానికి కష్టపడుతుంది.

ప్రస్తుతం జిల్లాలో బలబలాలు పరిశీలిస్తే…చీపురుపల్లి, గజపతినగరం, సాలూరు స్థానాల్లో వైసీపీకి లీడ్ కనిపిస్తోంది. విజయనగరం, శృంగవరపుకోట, బొబ్బిలి స్థానాల్లో టీడీపీకి లీడ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక నెల్లిమర్ల, కురుపాం, పార్వతీపురం స్థానాల్లో రెండు పార్టీల మధ్య పోటాపోటి ఉందని చెప్పవచ్చు. మొత్తానికి గత ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేస్తే..ఇప్పుడు టీడీపీ చాలావరకు పికప్ అయింది.