బాలయ్య అల్లుడు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడా..!!

నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతోమంది సినీ ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో బాలకృష్ణ ,ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. ఇక బాలయ్య కుటుంబం నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య కూతుర్లలో చిన్న కూతురు తేజస్విని అన్ స్టాపబుల్ షో కోసం క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఈ షో సక్సెస్ లో భాగమౌతోంది. దీంతో బాలయ్య చిన్న కూతురు అల్లుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Naidu Benefits 2000 Cr to Balayya's SIL! | cinejosh.comబాలయ్య, బోయపాటి శ్రీను  కాంబినేషన్లో  వచ్చిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరొక సినిమాని 14 వీల్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాని అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి కొంతమేరకు పెట్టుబడి లో భాగస్వామ్యం కాబోతున్నట్లు బాలయ్య చిన్నల్లుడు భరత్ తెలుస్తోంది. మరొకవైపు బాలయ్య ఆదిత్య 369 సినిమా తెరకెక్కించబోతున్నట్లు తెలియజేశారు ఈ సినిమాని ఆదిత్య 999 మాక్స్ పేరుతో తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే వైరల్ గా మారుతుంది.
ఈ సినిమాకి బాలయ్య చిన్న కూతురు నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. నందమూరి కుటుంబంలో ఇప్పటికే 11 బ్యానర్లో ఉండగా రాబోయే రోజుల్లో ఈ బ్యానర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలు అన్నీ కూడా ఎక్కువగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం .ఇక బాలయ్య కొడుకు మోక్షాజ్ఞ ఎంట్రీ సినిమా కోసం ఒక భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో ఎక్కడ రాజీ పడకుండా తన సొంత బ్యానర్ లోనే సినిమాలు తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. మరి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.