టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డేకు ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్లతో యమా జోరు చూపించిన పూజా హెగ్డే.. ఈ ఏడాది వరుస ఫ్లాపుల్లో మునిగిపోయింది. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలు భారీ అంచనాల నడుమ వచ్చి ప్రేక్షకులను ఘోరంగా నిరాశపరిచాయి.
తాజాగా ఈ అమ్మడు `సర్కస్` అనే మూవీతో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో రణ్వీర్ సింగ్ హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. వరుస ఫ్లాపుల నేపథ్యంలో పూజా హెగ్డేను ఐరన్ లెగ్ అంటూ గట్టిగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ అమ్మడు ఆశలన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పైనే పెట్టుకుంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీతో అయినా హిట్టు కట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని పూజా హెగ్డే ఆరాటపడుతుంది. ఇక ఈసారి హిట్ మిస్ అయితే పూజా హెగ్డే కెరీర్ ఖతం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.