విజ‌య్ `వార‌సుడు` రన్‌ టైమ్‌ మరీ అంత ఎక్కువా?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వారిసు(వార‌సుడు)`. ఇందులో నేష‌న‌ల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టించింది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగి బాబు, సంగీత త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హై బ‌డ్జెట్ తో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.

 

అయితే తాజాగా ఈ సినిమా ర‌న్ టైమ్ డీటైల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కిన వార‌సుడు చిత్రానికి రన్‌టైమ్‌ను 2 గంటల 43 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఒక కమర్షియల్ సినిమాకు ఇది కాస్త ఎక్కువ రన్‌టైమ్ అని చెప్పాలి. కానీ, కంటెంట్ ఉంటే ర‌న్ టైమ్ ఎక్కువ ఉన్నా ప్రేక్ష‌కుల‌ను సినిమాను ఎంజాయ్ చేస్తూ చూస్తారు. అయితే ఒక్కోసారి లెంగ్తీ ర‌న్ టైమ్ కార‌ణంగా సైతం ఫ్లాప్ అయిన చిత్రాలు ఉన్నాయి.