ఇండస్ట్రీలో విషాదం.. నటుడు చలపతిరావు కన్నుమూత..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలు విభిన్నమైన పాత్రలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు సీనియర్ నటుడు చలపతిరావు. ప్రస్తుతం ఈయన వయసు 78 సంవత్సరాలు. అయితే ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో తుది శ్వాస విడిచడం జరిగింది. తెలుగు చిత్ర సీమ తొలి స్థలం నటులు ఒకొక్కరిగా దూరమవుతూ ఉన్నారు. గడిచిన రెండు రోజుల క్రితం కైకాల సత్యనారాయణ గారు మరణించగా నేడు సీనియర్ యాక్టర్ చలపతిరావు కన్నుమూయడం జరిగింది.

Chalapathi Rao | Book, Contact, Price, Event, Show Booking | LiveClefs

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఈయన ఈరోజు ఉదయం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హైదరాబాదులో తన నివాసంలోనే తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది .ఆయన కుమారుడు రవిబాబు, కుమార్తెలు మాలినీ దేవి, శ్రీదేవి ఉన్నారు. చలపతిరావు 1944 మే 8వ తేదీన కృష్ణాజిల్లాలోని బల్లిపర్రు లో జన్మించారు. 1966 లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూడచారి 116 సినిమాతోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో చిత్రాలలో సహాయ నటుడిగా విలన్ గా కమెడియన్గా నటించిన ఈయన దాదాపుగా 1200 పైగా సినిమాలలో నటించారు. ఇక ఈయన కుమారుడు రవిబాబు కూడా ఎన్నో చిత్రాలలో నటుడుగా సైడ్ క్యారెక్టర్లలో దర్శకుడుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

చలపతి రావు గారు ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు దాదాపుగా మూడు తరాల హీరోలకు కలిసి వెండితెర పైన నటించారు. నిర్మాతగా ఆయన గుర్తింపు పొందారు. తన నిర్మాణ సామర్థ్యంలో కలియుగ కృష్ణుడు కడప రెడ్డమ్మ పెళ్లంటే నూరేళ్లపంట రాష్ట్రపతి గారి అల్లుడు తదితర చిత్రాలను తెరకెక్కించారుఅంతేకాకుండా పలు టీవీ సీరియల్ లో కూడా నటించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శోకసముద్రంలోకి మునిగిపోయారు.