కృతి శెట్టి సెంటిమెంట్ తో మళ్ళీ ఆ హీరోకి ఫ్లాపెనా..?

టాలీవుడ్ లో యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో మొదట సైడ్ క్యారెక్టర్లలో నటించిన శర్వా ఆ తర్వాత నెమ్మదిగా పలు చిత్రాలలో హీరోగా నటించారు. శర్వానంద్ కెరియర్ లో మహానుభావుడు, శతమానంభవతి, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రన్ రాజా రన్ ,పడి పడి లేచే మనసు వంటి చిత్రాలు బాగానే ఆకట్టుకున్నాయి. ఇదంతా ఎలా ఉండగా ఇటీవల శర్వా ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కంటే ముందు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదలకాగా ఈ చిత్రం భారీ డిజాస్టర్ ను చవిచూసింది.

Krithi Shetty In Sharwanand Movie: శర్వానంద్ సరసన లక్కీ హీరోయిన్, బేబమ్మ  మ్యానియా మామూలుగా లేదు.

ఆ తర్వాత విడుదలైన ఒకే ఒక జీవితం సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇటీవల బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి కూడా గెస్ట్ గా హాజరయ్యారు శర్వా. శర్వానంద్ నెక్స్ట్ మూవీ ఎటువంటి సినిమాలో నటించబోతున్నారు అనే విషయం ఇప్పుడు అభిమానుల హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు దర్శకుడు ఎవరు ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ తాజాగా శర్వానంద్ తదుపరి సినిమాలో ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారుతోంది.

అదేమిటంటే డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో కలిసి తన సినిమాని మొదలుపెట్టబోతున్నట్లు ఆ సినిమాలో హీరోయిన్గా కృతి శెట్టి నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కృతి శెట్టి వరుస ప్లాప్ లతో సతమతమవుతోంది. ఇలాంటి సమయంలో శర్వానంద్ తో కలిసి రొమాన్స్ చేయబోతుందా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో వచ్చేయేడాది మొదలుపెట్టబోతున్నారు. మరి ఈ సినిమా ఫ్లాప్ అవుతుందా సక్సెస్ అవుతుందా చూడాలి మరి.