కందుకూరుకు బాబు..టీడీపీ సీటు తేలుతుందా?

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇక బాబు ఎక్కడకు వెళ్ళితే అక్కడ జనం భారీ ఎత్తున వస్తున్నారు. రోడ్ షోలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అంతకముందు బాదుడేబాదుడు కార్యక్రమం కావచ్చు. ఇప్పుడు ఇదేం ఖర్మ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇటీవల పశ్చిమ గోదావరి, బాపట్ల, విజయనగరం జిల్లాల్లో బాబు రోడ్ షోలకు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు వస్తున్నారు.

అయితే ఎంత జనాలని తరలించిన ఆ స్థాయిలో రావడం చాలా కష్టం. పైగా గంటల గంటలు వెయిట్ చేయలేరు. కానీ బాబు పర్యటనల్లో శ్రేణులు భారీ స్థాయిలో కనిపిస్తున్నారు. ఇక ఇదే ఊపుతో ఇంకా పలు జిల్లాల పర్యటనలకు బాబు వెళుతున్నారు. డిసెంబర్ 28న కందుకూరు, 29న కావలి, 30న కోవూరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇక మూడు సీట్లలో గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది.

ఇప్పుడు ఆ మూడు స్థానాల్లో పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు పర్యటన సాగనుంది. దాని కంటే ముందు కందుకూరు స్థానంలో అసలు సీటు ఎవరికి అనేది తేల్చల్సి ఉంది. ఇక్కడ సీటు కోసం పోటీ ఉంది. అసలు కమ్మ వర్గం ఓట్లు ఎక్కువ ఉన్న ఈ సీటులో టీడీపీ గెలిచి చాలా ఏళ్ళు అయింది..ఎప్పుడో 1999 ఎన్నికల్లో గెలిచింది. మళ్ళీ ఇక్కడ గెలవలేదు.

ప్రస్తుతం ఇక్కడ ఇంచార్జ్ గా ఇంటూరి నాగేశ్వరరావు ఉన్నారు..అటు మాజీ ఎమ్మెల్యీలు దివి శివరాం, పోతుల రామారావు సైతం ఉన్నారు. ఈ ముగ్గురు సీటు రేసులో ఉన్నారు. అయితే నాయకులని సమన్వయం చేసి..బలమైన నేతకు సీటు ఇచ్చి..అందరూ కలిసికట్టుగా పనిచేసేలా చేస్తే కందుకూరు టీడీపీ సొంతమయ్యే ఛాన్స్ ఉంది.