భర్తతో కాజ‌ల్ లిప్‌లాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న‌ రొమాంటిక్ పిక్‌!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ 2020 కరోనా సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు గ‌త గర్భం దాల్చింది.

దాంతో నటనకు బ్రేక్ ఇచ్చిన కాజల్ ఈ ఏడాది ఆరంభంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిన కాజల్ తరచూ తన‌యుడు నీల్ కిచ్లూతో గ‌డిపిన మధుర క్షణాలను ఫోటోలు, వీడియోల రూపంలో బంధించి ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. అలాగే వీలు చిక్కనప్పుడల్లా గ్లామర్ ఫోటోషూట్లతో అల్లాడిస్తోంది.

ఇక తాజాగా క్రిస్మస్ సందర్భంగా ఈ అమ్మడు ఓ రొమాంటిక్ పిక్ ను షేర్ చేసింది. ఈ పిక్ లో గౌతమ్ కిచ్లూ నీల్ కిచ్లూను ఎత్తుకుని ఉండ‌గా.. కాజల్ భ‌ర్త‌కు లాపిలాక్ ఇస్తూ లోకాన్ని మ‌ర‌చిపోయి కనిపిస్తోంది. మోస్ట్ రొమాంటిక్ గా ఉన్నాయి ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాను వేరే లెవెల్ లో షేక్ చేస్తోంది. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం కాజ‌ల్ క‌మ‌ల్ హాస‌న్‌తో శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఇండియ‌న్ 2`లో భాగ‌మైంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.